Asianet News TeluguAsianet News Telugu

టెక్కీ సతీష్ హత్య కేసులో ట్విస్ట్: అక్రమ సంబంధమే కారణం

సాఫ్ట్ వేర్ ఇంజనీరు సతీష్ మిత్రుడు హేమంత్ చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్ ను చంపి, శవాన్ని హేమంత్ ముక్కలుగా చేసి పార్శిల్ చేయడానికి ప్రయత్నించాడు.

Hyderabad: Twist in techie Satish murder case
Author
KPHB, First Published Aug 31, 2019, 11:06 AM IST

హైదరాబాద్: సాఫ్ట్ వేర్ ఇంజనీరు సతీష్ బాబు హత్య కేసులో కొత్త విషయం వెలుగు చూసింది. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్ ను మిత్రుడే పథకం ప్రకారం హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. హేమంత్ స్నేహితురాలితో సతీష్ కు సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. 

స్నేహితుల మధ్య ఆర్థికపరమైన గొడవలు తలెత్తినట్లు హేమంత్ స్నేహితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.  హేమంత్, సతీష్ బాల్య మిత్రులు. ఇద్దరు కూడా వ్యాపార భాగస్వాములు.సతీష్ ను హేమంత్ దారుణంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా కోసి పార్శిల్ చేసేందుకు ప్రయత్నించాడదు. అయితే, కారణం తెలియదు గానీ శవాన్ని ఇంట్లోనే వదిలేసి ఫోన్ స్విచాఫ్ చేసి పారిపోయాడు. 

ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన సతీష్ బాబు (35), భీమవరానికి చెందిన హేమంత్ కోరుకొండ సైనిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. విదేశాల్లో ఎంఎస్ చదివి తిరిగి వచ్చిన సతీష్ ఏడాది క్రితం హేమంత్ తో కలిసి కెపిహెచ్ బీ కాలనీలో ఐటీ స్లేట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ సంస్థను ప్రారంభించాడు. 

సతీష్ తన భార్య ప్రశాంతితో కలిసి మూసాపేటలోని ఆంజనేయ నగర్ లో ఉంటున్నాడు. హేమంత్ కుటుంబం ఆల్వాల్ లో నివాసం ఉంటోంది. అయితే, హేమంత్ మాత్రం కేపిహెచ్ బీ కాలనీలో కార్యాలయానికి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. 

ఎస్ఆర్ నగర్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఐటి విద్యార్థులకు పాఠాలు చెబుతూ సతీష్ సొంత సంస్థ కార్యకలాపాలు కూడా చూసుకునేవాడు. బుధవారం రాత్రి క్లాస్ ముగిసిన తర్వాత కార్యాలయానికి వచ్చాడు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో తన భార్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. 

అయితే, అర్థరాత్రి దాటినా అతను ఇంటికి రాలేదు. దీంతో ప్రశాంతి అతనికి ఫోన్ చేసింది. ఫోన్ స్వీచాఫ్ లో ఉన్నట్లు ఆమెకు అర్థమైంది. గురువారంనాడు అతని ఆచూకీ తెలియకపోవడంతో ఆమె కెపిహెచ్ బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

హేమంత్ ఫోన్ కూడా స్విచాప్ రావడంతో ప్రశాంతికి అనుమానం వచ్చింది. ఆ విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పింది. హేమంత్ కోసం పోలీసులు ఆరా తీయగా ఫలితం లభించలేదు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా అనతు కెపిహెచ్ బీ 7వ ఫేజులో ఉన్నట్లు గుర్తించారు. 

దాంతో పోలీసులు హేమంత్ ఇంటికి వెళ్లారు. ఇంట్లోంచి దుర్వాస వస్తుండడాన్ని పసిగట్టి తలుపులు బద్దలు కొట్టి చూశారు. సతీష్ హత్యకు గురై కనిపించాడు. గొంతు కోసి ఉండడంతో పాటు కడుపు, కాళ్లపై కత్తిగాట్లున్నాయి. కుడికాలు మోకాలు వరకు కోత పెట్టి ఉంది. 

ఇంట్లో పెద్ద ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, పొడవైన టీవీ అట్టపెట్టెలు కనిపించాయి. శవంపై ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంది. దీంతో హేమంత్ సతీష్ ను చంపేసి పరారైనట్లు పోలీసులు భావించారు. సతీష్ ను హత్య చేసే సమయంలో హేమంత్ పాటు ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హేమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్త

కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య

Follow Us:
Download App:
  • android
  • ios