హైదరాబాద్:టెక్కీ సతీష్ హత్య కేసులో అతని స్నేహితుడు హేమంత్ ను  మంగళవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సతీష్ ను తానే హత్య చేసినట్టుగా హేమంత్ ఒప్పుకొన్నాడని సమాచారం.సతీష్ ను హత్య చేసేందుకు హేమంత్ కు ఎవరెవరు సహకరించారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ ఏడాది ఆగష్టు 30వ తేదీ హేమంత్ ఇంట్లో సతీష్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.టెక్కీ సతీష్‌ హత్య కేసులో ఇంకా చిక్కుముడులు ఉన్నాయి.ఈ చిక్కుముడులను విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సతీష్ హత్యలో  ఓ యువతికి ఎలాంటి సంబంధం లేదని హేమంత్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం.

తమ కంపెనీలో పనిచేస్తున్న యువతికి దూరంగా ఉండాలని సతీష్ హేమంత్ కు చెప్పడంతోనే ఈ హత్య చేసినట్టుగా హేమంత్ పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం.

ఏడాదిగా హేమంత్ భార్యకు దూరంగా ఉంటున్నారు. సతీష్ కంపెనీలో పనిచేస్తున్న యువతితో హేమంత్ సన్నిహితంగా ఉంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది.ఆ యువతికి దూరంగా ఉండాలని సతీష్ చెప్పడంతో ఆయనను హత్య  చేసినట్టుగా సమాచారం.

సంబంధిత వార్తలు

టెక్కీ సతీశ్ హత్య: వీడని చిక్కుముడులు, మరిన్ని ట్విస్టులు

టెక్కీ సతీష్ హత్య కేసులో ట్విస్ట్: అక్రమ సంబంధమే కారణం

కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య