హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

మూహూర్తం బాగుండటంతో బుధవారం కేసీఆర్ గజ్వేల్ లోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి అట్టహాసం లేకుండా మంత్రి హరీష్ రావుతోపాటు పలువురు  కీలక నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. 

నామినేష్ లో కేసీఆర్ తన ఆస్థులు, అప్పులు, తనపై ఉన్న పోలీస్ కేసులన్నింటిని అఫిడవిట్ లో పొందుపరిచారు. అఫిడవిట్ ప్రకారం కేసీఆర్ మొత్తం ఆస్తుల విలువ రూ.22కోట్ల 60లక్షల 77,946 కాగా, వీటిలో చరాస్తులు రూ.10కోట్ల 40లక్షల 77వేల 946, స్థిరాస్తులు రూ.12 కోట్ల 20లక్షలుగా పేర్కొన్నారు. ఇకపోతే కేసీఆర్ వద్ద నగదు రూపంలో రూ.2 లక్షల 40వేలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

గజ్వేల్ నుండి కేసీఆర్ నామినేషన్ దాఖలు

నేను ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు: కేసీఆర్

అదే సెంటిమెంట్: నామినేషన్ పత్రానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు

తిరుగులేని ముహుర్తంలో కేసీఆర్ నామినేషన్: ఇక రాజయోగమేనా

కేసీఆర్ కోట: గజ్వెల్ సీటు చరిత్ర, సెంటి మెంట్ ఇదీ....

తిరుగులేని ముహూర్తం: నామినేషన్ వేసి...కేసీఆర్ ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారా..?

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత