Rajanna-Sircilla: పునుగులు తింటూ చిన్నారి మృతి..

Rajanna-Sircilla: గొంతులో ఆహార ప‌దార్థం ఇరుక్కుపోయి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పునుగులను మింగిన చిన్నారి గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఈ క్ర‌మంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 
 

Baby dies after food gets stuck in his throat In Mustabad, Rajanna-Sircilla RMA

Baby dies after food gets stuck in his throat: గొంతులో ఆహార ప‌దార్థం ఇరుక్కుపోయి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పునుగులను మింగిన చిన్నారి గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఈ క్ర‌మంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. ముస్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఆహారం గొంతులో ఇరుక్కుపోవడంతో 13 నెలల చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి తల్లి కవిత ఇంటి పనులు చేస్తుండగా కుమారుడు క్రాంతికుమార్ ముందు కొన్ని పునుగుల ముక్కలను ఉంచింది. పునుగులను మింగిన చిన్నారి గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా స్పృహతప్పి పడిపోయాడు. అయితే ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

కవిత వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌతాల్ మండలం వెర్దండికి చెందిన మారుతి, కవిత దంపతులు రెండేళ్ల క్రితం ముస్తాబాద్ కు వలస వచ్చి దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గ‌తంలో విజ‌య‌న‌గ‌రంలోనూ..

2020లో స్నాక్స్ తింటూ బొమ్మ గొంతులో ఇరుక్కుపోయి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గరుగుబిల్లి మండలం చినగూడ ఎస్సీ వీధికి చెందిన సంధ్యారాణి తన ఏడాది కుమార్తె మౌనికకు స్నాక్స్ ప్యాకెట్ ఇచ్చింది. అది తింటుండగా చిన్నారి ప్రమాదవశాత్తు స్నాక్స్ ప్యాకెట్ లోని బొమ్మను మింగేసి గొంతులో ఇరుక్కుపోయింది.

చిన్నారి స్పృహతప్పి పడిపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి గొంతులో ఇరుక్కుపోయిన బొమ్మను బయటకు తీశారు. ఈ ఘటనపై పాప తల్లిదండ్రులు గురుగుబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, పోలీసులు తల్లిదండ్రులను హెచ్చరించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios