ప్రణయ్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించి కానిస్టేబుల్‌ను చూసి పారిపోయిన యువకుడిని ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు


మిర్యాలగూడ: ప్రణయ్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించి కానిస్టేబుల్‌ను చూసి పారిపోయిన యువకుడిని ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్ మండలం కరక్కాయలగూడెంకు చెందినవాడుగా పోలీసులు ప్రకటించారు.

రెండు రోజుల క్రితం ప్రణయ్ ఇంటి ప్రహరీ గోడను దూకి ఆంజనేయులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కానిస్టేబుల్‌ను చూసి అతను పారిపోయాడు. ఈ విషయమై ప్రణయ్ భార్య అమృత, ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

"

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేశారు.ప్రణయ్ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీని పరిశీలించి నిందితుడి ఆచూకీని తెలుసుకొన్నారు. హుజూర్‌నగర్‌ మండలం కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన ఆంజనేయులుగా పోలీసలుు గుర్తించారు. 

ఆంజనేయులుపై చోరీ కేసులున్నాయని మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. నిందితుడి నుండి రూ. 8 వేలను స్వాధీనం చేసుకొన్నట్టు ఆయన తెలిపారు. రెండు మాసాల క్రితం మారుతీరావు జ్యోతి ఆసుపత్రి వద్ద ప్రణయ్ ను కిరాయి హంతకులతో హత్య చేయించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

ప్రణయ్ ఇంటి వద్ద దుండగుడి సంచారం.. మరో హత్యకు కుట్రపన్నారా..?

ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు

ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్: మారుతీరావు, శ్రవణ్‌ల ఇళ్లలో పోలీసుల సోదాలు

ప్రణయ్ అసలు ‘‘ఎస్సీ’’ కాదు

ప్రణయ్ విగ్రహం... మారుతీరావుకి మద్దతుగా భారీ ర్యాలీ

ప్రణయ్ మర్డర్ కేసులో రాజకీయ కుట్ర...వారిని తప్పించడానికే : అంబటి

ప్రణయ్ హత్య, మాధవిపై తండ్రి దాడి: వాటి పునాదులేమిటి?

ఇది మరో ప్రణయ్-అమృతల కథ.. ఆలస్యంగా వెలుగులోకి

అమృతను కిడ్నాప్ చేసి, ప్రణయ్‌ను చంపాలని స్కెచ్: ఎస్పీ

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ