ఎస్సీలకు వర్తించే చట్టాలు ప్రణయ్‌కు వర్తింపచేయవద్దని నల్లగొండ కలెక్టర్‌ను కోరింది.

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్.. అసలు ఎస్సీ కులానికి చెందినవాడు కాదని మాల యువసేన ఆరోపించింది. ప్రణయ్ తక్కువ కులస్థుడు అనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు హత్య చేయించిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.

దీనిపై మాలయువసేన స్పందించింది. ప్రణయ్‌ క్రైస్తవుడని తెలంగాణ మాల యువసేన వెల్లడించింది. అతడి అంత్యక్రియలు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారమే జరిగాయని స్పష్టం చేసింది. ఎస్సీలకు వర్తించే చట్టాలు ప్రణయ్‌కు వర్తింపచేయవద్దని నల్లగొండ కలెక్టర్‌ను కోరింది. క్రైస్తవమతం స్వీకరించిన నేపథ్యంలో.. ప్రణయ్‌ బీసీ-సీ పరిగణనలోకి వస్తారు కాబట్టి.. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఇచ్చే ఆర్థిక సహకారం పొందేందుకు వారి కుటుంబసభ్యులు అనర్హులని తెలిపింది.