Asianet News TeluguAsianet News Telugu

ప్రణయ్ ఇంటి వద్ద దుండగుడి సంచారం.. మరో హత్యకు కుట్రపన్నారా..?

ప్రణయ్ ఇంటి వద్ద ఓ దుండగుడు సంచరించినట్లు తెలిసింది. భద్రతా చర్యల్లో భాగంగా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. శనివారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి ముసుగు ధరించి ప్రణయ్ ఇంటి ప్రాంగణంలో తచ్చాడినట్లు గుర్తించారు.

Unkown person at Pranay home
Author
Miryalaguda, First Published Nov 5, 2018, 10:16 AM IST

మిర్యాలగూడకు చెందిన మారుతీరావు తన కూతురు తక్కువ కులం వ్యక్తిని పెళ్లిచేసుకుందనే కక్షతో అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతకులతో చంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రణయ్ తల్లిదండ్రులతో పాటు తన ప్రాణానికి సైతం ముప్పుందని అమృత ఆరోపించింది.

దీంతో పోలీసులు ప్రణయ్ నివాసం వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. హత్య జరిగి రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో తాజాగా.. ప్రణయ్ ఇంటి వద్ద ఓ దుండగుడు సంచరించినట్లు తెలిసింది.

భద్రతా చర్యల్లో భాగంగా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. శనివారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి ముసుగు ధరించి ప్రణయ్ ఇంటి ప్రాంగణంలో తచ్చాడినట్లు గుర్తించారు. అయితే ఆ సమయంలో పోలీసుల పెట్రోలింగ్ వ్యాన్ చూసి పరారయ్యాడని వారుత తెలిపారు.

ఈ సంఘటనపై ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మరోవైపు ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులైన మారుతీరావు, కరీం, శ్రావణ్ కుమార్‌లపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. 

ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు

ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్: మారుతీరావు, శ్రవణ్‌ల ఇళ్లలో పోలీసుల సోదాలు

ప్రణయ్ అసలు ‘‘ఎస్సీ’’ కాదు

ప్రణయ్ విగ్రహం... మారుతీరావుకి మద్దతుగా భారీ ర్యాలీ

ప్రణయ్ మర్డర్ కేసులో రాజకీయ కుట్ర...వారిని తప్పించడానికే : అంబటి

ప్రణయ్ హత్య, మాధవిపై తండ్రి దాడి: వాటి పునాదులేమిటి?

ఇది మరో ప్రణయ్-అమృతల కథ.. ఆలస్యంగా వెలుగులోకి

అమృతను కిడ్నాప్ చేసి, ప్రణయ్‌ను చంపాలని స్కెచ్: ఎస్పీ

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

Follow Us:
Download App:
  • android
  • ios