హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ బీజేపీ గూటికి చేరుతారని ఎంఐఎం నేత అక్భరుద్దీన్ ఓవైసీ చెప్పారు.పాతబస్తీలో పలు సభల్లో అక్బరుద్దీన్ ప్రచారం నిర్వహించారు. 

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం రాత్రి పాతబస్తీలో జరిగిన ఎన్నికల సభలో  మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఐదు నుండి పదేళ్లపాటు పాలిస్తోందన్నారు. 

కాంగ్రెస్ పాలన తర్వాత తెలంగాణలో బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే చాన్స్ ఉందన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొనే తాము టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.

టీఆర్ఎస్ తమ మాట వినకపోతే పరిస్థితులకు అనుగుణంగా తమ రాజకీయ వ్యూహాన్ని మార్చుకొంటామని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.కర్ణాటక తరహలో తెలంగాణలో తాము కూడ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తామని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఎవరైనా మా ముందు తల వంచాల్సిందే: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

ఆరోగ్యం బాలేదు.. ఇవే నా చివరి ఎన్నికలు.. అక్బరుద్దీన్ ఓవైసీ

మనం సిఎం కాలేమా: కర్ణాటక సీన్ రిపీట్ పై అక్బరుద్దీన్ ఆశలు

ఇంత టైం చాలు, భూకంపం పుట్టిస్తా: అక్బరుద్దీన్ ఓవైసీ

అక్బరుద్దీన్ పై పోటీ, బీజేపీ అభ్యర్థికి బెదిరింపులు

నన్ను చంపేందుకు 11 మంది దిగారు: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు