ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కి పోటీగా.. బీజేపీ  ముస్లిం యువతి షెహజాదిని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే.

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కి పోటీగా.. బీజేపీ ముస్లిం యువతి షెహజాదిని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె బీజేపీ అభ్యర్థిగా చాంద్రాయణ గుట్ట నియోజకవర్గానికి నామినేషన్ కూడా దాఖలు చేశారు.

అయితే.. ఆమె అక్బరుద్దీన్ కి పోటీగా దిగడం ఆ పార్టీ కార్యకర్తలకు నచ్చలేదు. ఆమెను ఎలాగైనా ఓడించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె నామినేషన్ వెకనక్కి తీసుకునేలా చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఓ కార్యకర్త ఆమెను బెదిరిస్తూ ఓ వీడియో పంపించాడు.

 చంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోకి అసలు అడుగపెట్టకూడదని బెదిరిస్తూ.. ఆమెకు వీడియో పంపారు. కాగా.. తనను ఎంఐఎం కార్యకర్తలు బెదిరిస్తున్నారంటూ, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

ఇదిలా ఉండగా.. అక్బరుద్దీన్.. చంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు విజయం సాధించారు. ఆమెకు పోటీగా బీజేపీ షెహజాది అనే యువతిని రంగంలోకి దింపింది. ఈమె గతంలో ఏబీవీపీ కార్యకర్తగా కూడా పనిచేశారు. 

read more news

అక్బరుద్దీన్ పై ముస్లిం యువతిని పోటీకి దింపుతున్న బీజేపీ