ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ దేశంలో 4,200 మంది శాసనసభ్యులుంటే ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లిస్ గురించి మోడీ, రాహుల్ గాంధీ తదితర నేతలు మాట్లాడేలా చేశామన్నారు.

దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మైనార్టీల కోసం ఏమీ చేయలేదన్నారు. ప్రజా సంపదతో నిర్మించిన రహదారులు, విమానాశ్రయాలు, ఇతర సంస్థలకు తమ పేర్లు పెట్టుకుందని అక్బరుద్దీన్ విమర్శించారు. మజ్లిస్ ఎవరి వద్ద తలదించుకోదని, ఎంతటి వారైనా తమ వద్ద తలదించుకోవాల్సిందేనని ఒవైసీ చెప్పారు.

పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో 800కు పైగా సభ్యులుంటే ముస్లిం , మైనారిటీల తరపున గళం వినిపించేది మజ్లిస్ అధినేత అసదుద్దీన్ మాత్రమేనని అక్బరుద్దీన్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల తర్వాత మోడీ, రాంహుల్ గాంధీ, సోనియాల ఓటమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.

వారణాసి, అమేథీ, రాయబరేలిలో పర్యటించి 2019లో వారు ఓడిపోయేలా పనిచేస్తానన్నారు. రాజకీయాల్లో కుటుంబసభ్యులను లాగడాన్ని వ్యతిరేకించే వారిలో మొదట తానే ఉంటానని చెప్పారు.

నోట్లను రద్దు చేసిన సమయంలో ప్రధాని నరేంద్రమోడీ తన మాతృమూర్తిని క్యూలో నిలబెట్టి రాజకీయం చేశారని ఎద్దేవా చేశారు. పాతబస్తీలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం విజయం సాధిస్తుందని అక్బరుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. 

ఆరోగ్యం బాలేదు.. ఇవే నా చివరి ఎన్నికలు.. అక్బరుద్దీన్ ఓవైసీ

మనం సిఎం కాలేమా: కర్ణాటక సీన్ రిపీట్ పై అక్బరుద్దీన్ ఆశలు

ఇంత టైం చాలు, భూకంపం పుట్టిస్తా: అక్బరుద్దీన్ ఓవైసీ

అక్బరుద్దీన్ పై పోటీ, బీజేపీ అభ్యర్థికి బెదిరింపులు

నన్ను చంపేందుకు 11 మంది దిగారు: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు