హైదరాబాద్: అవకాశం వస్తే  తాను తెలంగాణలో పోటీ చేస్తానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో  మాట్లాడారు.  సోషల్ మీడియాలో  వస్తున్న సర్వేలతో తనకు సంబంధం లేదని ఆయన ప్రకటించారు.

తెలంగాణలో డిసెంబర్ 7వ తేదీన జరుగుతున్న ఎన్నికలను పురస్కరించుకొని  సోషల్ మీడియాలో వస్తున్న సర్వే వివరాల గురించి ఆయన స్పందించారు. పార్టీలు కోరితే సర్వేలు చేసి చెబుతానని ఆయన స్పష్టం చేశారు.  తెలంగాణలో పోటీ చేసే అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.

డిసెంబర్ 7వ తేదీ తర్వాత తన సర్వే వివరాలను వెల్లడించనున్నట్టు చెప్పారు.  తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు సక్సెస్ అవుతోందా... లేదా అనేది ప్రజలే నిర్ణయిస్తారని లగడపాటి చెప్పారు.

2014 నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. భావోద్వేగాలతో రాజకీయాల్లో ఎదగాలని ప్రయత్నిస్తున్నానని అందరూ అనుకోబట్టే రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని లగడపాటి స్పష్టం చేశారు.వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడిని ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు.భౌతిక దాడులు సరికావన్నారు.