ప్రీ పోల్ సర్వే: టీఆర్ఎస్ కు 9, కాంగ్రెసుకు 6, టీడీపి మటాష్

ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనే విషయాన్ని సీ - ఓటర్ సర్వే తెలియజేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ రెండు సీట్లు కోల్పోతుందని తెలియజేసింది. టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని చెప్పింది. 

Pre poll survey: TRS will loose seats

హైదరాబాద్: ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనే విషయాన్ని సీ - ఓటర్ సర్వే తెలియజేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ రెండు సీట్లు కోల్పోతుందని తెలియజేసింది. టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని చెప్పింది. 

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలుండగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 6, బీజేపీ, ఎంఐఎంలకు చెరో సీటు లభిస్తాయని సీ - ఓటర్ ప్రీ పోల్ సర్వే తెలియజేసింది.. 2014లో టీఆర్‌ఎస్‌ 11 స్థానాలు సాధించింది. 

ప్రస్తుతం ఆ పార్టీకి దాదాపు 35 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే 2 సీట్లు తగ్గుతాయని సర్వే తేల్చింది. తెలంగాణలో కాంగ్రెస్‌–టీడీపీ, ఇతర పార్టీలు కలిసి ఎన్నికల్లో కూటమిగా పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. 

2014లో టీడీపీ–బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ రెండు పార్టీలూ చెరో సీటును గెలుచుకున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ తన ఒక్క సీటును నిలుపుకోనుండగా టీడీపీకి ఆ ఒక్క సీటు కూడా రాదని తేల్చింది. 

మరోవైపు కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో రెండే సీట్లు గెలుచుకుంది. అయితే, ఇప్పుడు టీడీపీ, ఇతర పార్టీల కూటమితో లాభపడి ఈసారి ఆరు సీట్లలో విజయం సాధిస్తుందని సర్వేలో తేలింది. మజ్లీస్ కు 2014లో వచ్చిన ఓట్ల కన్నా ఇప్పుడు 22 శాతం ఓట్లు అధికంగా వస్తాయని, అయితే ఆ పార్టీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంటుందని సర్వే తేల్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios