సర్వే: కేసీఆర్‌కు అంత లేదు, మెరుగైన కాంగ్రెస్

తెలంగాణలో ఇప్పటికిప్పుడు లో‌క్‌సభ ఎన్నికలు జరిగితే  మహా కూటమి( ప్రజా కూటమి) కే ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందని రిపబ్లిక్, సీ- ఓటర్ సర్వే  తెలిపింది. 

Republic and c-voter survey results on up coming elections in telangana


హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికిప్పుడు లో‌క్‌సభ ఎన్నికలు జరిగితే  మహా కూటమి( ప్రజా కూటమి) కే ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందని రిపబ్లిక్, సీ- ఓటర్ సర్వే  తెలిపింది. 

డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రిపబ్లిక్, సీ- ఓటర్ సర్వే   ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కల్గిస్తున్నాయి.

తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.  ఇప్పటికిప్పుడు తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగితే  మహాకూటమి 8, టీఆర్ఎస్ 7, బీజేపీ, ఎంఐఎం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకొనే పరిస్థితులు నెలకొంటాయని ఈ సర్వే  వెల్లడించింది.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి  కేవలం రెండు ఎంపీ స్థానాలు మాత్రమే దక్కాయి. కానీ,  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 8 స్థానాలను  ఆ పార్టీ దక్కించుకొంటుందని  సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 ఎంపీ స్థానాలను గెలుచుకొంది. అయితే ఈ దఫా టీఆర్ఎస్  నాలుగు స్థానాలను కోల్పోయే  అవకాశం ఉందని ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

  తెలంగాణలో సీఎం కె.చంద్రశేఖర రావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ 7 సీట్లు (30.40% ఓట్లు) , కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి 8 సీట్లు(32.2%), బీజేపీ 1 సీటు(19%), ఏఐఎంఐఎం 1 స్థానం( 3.9%) గెలుచుకుంటాయని సర్వే  చెబుతోంది. డిసెంబర్‌లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు భిన్నంగా ఉండొచ్చని ఈ సర్వే అభిప్రాయపడింది.

కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్  కలిసి పోటీచేయడం వల్ల 6.7 శాతం ఓట్లు  కాంగ్రెస్ కు అదనంగా  దక్కనున్నాయని ఈ సర్వే తేల్చి చెప్పింది. అయితే  గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కూటమిగా తెలంగాణలో పోటీ చేశాయి.అయితే ఈ దఫా తెలంగాణలో  బీజేపీ ఒంటరిగా పోటీ చేయనుంది. దీంతో ఈ ఎన్నికల్లో తన ఓట్ల శాతాన్ని కోల్పోయే అవకాశం ఉందని ఈ సర్వే అభిప్రాయపడింది.

 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios