Asianet News TeluguAsianet News Telugu

5G Trail Run: Hyderabdలో 5G నెట్ వర్క్ ట్రయల్ రన్

5g Network Services  పరికరాలు, నెట్ వర్క్ ను పరీక్షించేందుకు ఎంపికైన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది.దేశ‌వ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ టెస్ట్ చేయ‌డానికి దేశ‌వ్యాప్తంగా 13న‌గ‌రాల‌ను ఎంపిక చేశాయి ప్ర‌ముఖ టెలికాం సంస్థ‌లు ఎయిర్ టెల్, జియో, వోడో ఫోన్ ఐడియాలు. ఈ న‌గ‌రాల‌లో హైదరాబాద్ తో పాటు చెన్నై, ఢిల్లీ, ముంబై, గురుగావ్, పూణే, బెంగుళూరు, చండీగఢ్, కోల్‌కతా, జామ్‌నగర్, అహ్మదాబాద్,   లక్నో మరియు గాంధీ నగర్ వంటి పెద్ద నగరాల్లో 5జీ సేవలపై ట్రయల్ రన్ నిర్వహించనున్నాయి.

5g Network Services Comming To India In 2022 Selected 13 Cities
Author
Hyderabad, First Published Dec 28, 2021, 3:31 PM IST

5g services in hyderabad : ఇప్పటి వరకు మొబైల్ నెట్ వర్క్, కమ్యూనికేషన్ రంగంలో  2జీ, 3జీ  టెక్నాలజీలను వాడాం. ఈ క్రమంలో మ‌నం 4జీ నెట్ వర్క్ టెక్నాల‌జీని వాడుతున్నాం. ఈ టెక్నాల‌జీ ఏవిధంగా ఉంటుందో అంద‌రికీ తెలుసు. అలాంటి 4జీ టెక్నాల‌జీ ని త‌ల‌ద‌న్నేలా దేశంలో అతి త్వరలో 5జీ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రానుంది. 

ఈ క్ర‌మంలో 5జీ నెట్ వర్క్ కు సంబంధించిన పరికరాలను, నెట్ వర్క్ ను పరీక్షించేందుకు దేశ‌వ్యాప్తంగా కొన్ని న‌గ‌రాల‌ను ఎంపిక చేశారు. ఆ ఎంపికైన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది.   ఈ 5జీ నెట్ వర్క్ ను ప్రయోగాత్మకంగా హైదారాబాద్ లో అందుబాటులోకి రానున్నది.  5జీ నెట్ వర్క్ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్ తుది దశలో ఉందని డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT)  తెలిపింది.

Read Also: రిలయన్స్ జియో సరికొత్త స్పెషల్ రిచార్జ్ ప్లాన్స్.. ఇప్పుడు బంపర్ డేటాతో క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్స్ కూడా..
 
దేశ‌వ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ టెస్ట్ చేయ‌డానికి దేశ‌వ్యాప్తంగా 13న‌గ‌రాల‌ను ఎంపిక చేశాయి ప్ర‌ముఖ టెలికాం సంస్థ‌లు ఎయిర్ టెల్, జియో, వోడో ఫోన్ ఐడియాలు. ఈ నగ‌రాల జాబితాలో హైదరాబాద్ తో పాటు, చెన్నై, ఢిల్లీ, ముంబై, గురుగావ్, పూణే, బెంగుళూరు, చండీగఢ్, కోల్‌కతా, జామ్‌నగర్, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో గాంధీ నగర్ వంటి పెద్ద నగరాలున్నాయి. ఈ న‌గ‌రాల్లో 5జీ సేవలపై ట్రయల్ రన్ నిర్వహించనున్నాయి.

Read Also: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాకింగ్.. రిచార్జ్ ప్లాన్‌ ధరల పెంపు..?

ఈ ట్ర‌య‌ల్ ర‌న్ కోసం Jio, Airtel , Vi (Vodafone Idea) సంస్ధలు దేశంలోని 13 నగరాలు ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ నగరాల్లో టెస్ట్ సైట్‌లను ఏర్పాటు చేశారు.  ఎంపికైన నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై,  పూణే లు ఉన్నాయి. ఈ నగరాల్లో 5జీ సేవలపై ట్రయల్ రన్ నిర్వహించనున్నాయి.

Read Also: ఇండియాలోనే మొట్టమొదటి 5జీ డ్యూయల్‌ సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్స్ కూడా అదుర్స్..
    
2018లో ప్రారంభమైన స్వదేశీ 5G (/టాపిక్/5g) టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్ కోసం DoT ఏజెన్సీలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయి, IIT ఢిల్లీ , IIT హైదరాబాద్, IIT మద్రాస్, IIT కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) బెంగళూరు, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (SAMEER) మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీ (CEWiT) లాంటి 8 సంస్ధలు దీనిపై గత 3 ఏళ్లుగా పని చేస్తున్నాయి. డిసెంబర్ 31, 2021 నాటికి పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది ఆయా నగరాల్లో మొదటగా 5జీ సర్వీసులను ప్రారంభంలోకి తీసుకురానున్నారు. 5జీ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్ కు టెలికం విభాగం రూ. 224 కోట్ల రూపాయల మేర నిధులు అందిస్తోంది. 

ఈ ట్ర‌య‌ల్ ర‌న్ లో భాగంగా హైద‌రాబాద్ లో 5జీ నెట్ వర్క్ పరీక్షిస్తున్నారు. ఇందులో సిగ్నల్ స్పీడ్ అంచనా వేస్తారు. అన్నీ అంశాలను పరిశీలించి నివేదిక రూపొందిస్తారు. దాని ఆధారంగా ఎప్పటినుంచి 5జీ అందుబాటులోకి రానుందో తెలియనుంది. మరోవైపు ఇప్పటివరకు ఉన్న 4జీ సిగ్నల్స్ వద్ద 5జీ ట్రయల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios