భారతీయ కంపెనీ మొదటి 5జి స్మార్ట్‌ఫోన్.. వారెవ్వా, భలే చౌక బేరం
దేశీయ కంపెనీ లావా (lava)తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 5జీని విడుదల చేసింది. అలాగే, ఒక భారతీయ కంపెనీ 5జి స్మార్ట్‌ఫోన్(smartphone)ను ప్రవేశపెట్టడం కూడా ఇదే మొదటిసారి. లావా అగ్ని 5జి(lava agni 5g)లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఇచ్చారు. అంతేకాకుండా ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది.
లావా అగ్ని 5జితో 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ వస్తుంది. లావా అగ్ని 5జిలో 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే లభిస్తుంది. లావా నుండి వచ్చిన ఈ మొదటి 5G ఫోన్ రియల్ మీ 8ఎస్ 5జి, మోటో జి 5జి, స్యామ్సంగ్ గెలాక్సీ ఎం32 5జిలతో పోటీపడుతుంది.
లావా అగ్ని 5జీ ధర, లభ్యత
లావా అగ్ని 5జీ ధర రూ.19,999. ఈ ధర వద్ద 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్‌తో కూడిన వేరియంట్ అందుబాటులో ఉంటుంది. లావా అగ్ని 5జీని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో నవంబర్ 18 నుండి కొనుగోలు చేయవచ్చు. దీని ప్రీ-బుకింగ్ లావా ఇ-స్టోర్, అమెజాన్ ఇండియా నుండి ఇప్పటికే ప్రారంభమైంది. ప్రీ-బుకింగ్ సమయంలో రూ.500 చెల్లించాలి, తరువాత రూ. 2,000 తగ్గింపు ఉంటుంది.
లావా అగ్ని 5జీలో ఆండ్రాయిడ్ 11 ఇచ్చారు. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే స్టయిల్ పంచ్‌హోల్. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 810 ప్రాసెసర్, 8 జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ ఉన్నాయి, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో పెంచుకోవచ్చు.
లావా అగ్ని 5జీ కెమెరా
ఈ ఫోన్‌లో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌లు ఎపర్చరు f/1.79, రెండవ లెన్స్ 5 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ డెప్త్ అండ్ నాల్గవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సూపర్ నైట్ మోడ్, ప్రో మోడ్, ఏఐ వంటి మోడ్‌లు కెమెరాతో అందించారు.
లావా అగ్ని 5జి బ్యాటరీ
కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫోన్ కి 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 90 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుందని చెబుతున్నారు.