Asianet News TeluguAsianet News Telugu

IIT-Kharagpur: బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ విద్యార్థులు.. ఏడాదికి రూ.2 కోట్లకు పైనే!

ప్రముఖ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్​పూర్​ లో  ఈ ఏడాది ఐఐటీ చరిత్రలో అత్యధిక ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్నట్లు పేర్కొంది. ప్రతిష్టాత్మక ఐఐటీలో 1100 మందికి పైగా ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్నారు. ఇందులో ఇద్ద‌రూ విద్యార్థులు 2.4 కోట్ల ప్యాకేజీని అందుకున్నారు.
 

IIT Placements 2021: At 2.4 crore, IIT Kharagpur placement package
Author
Hyderabad, First Published Dec 5, 2021, 4:44 PM IST

IIT-Kharagpur:  శాస్త్ర‌, సాంకేతిక విద్యలో ప్ర‌పంచంలోనే గుర్తింపు పొందిన మ‌న ఐఐటీల కోసం అంత‌ర్జాతీయ కంపెనీలు క్యూలు క‌డుతున్నాయి. విద్యార్థుల‌కు కొలువు అందిస్తూ.. భారీ మొత్తంలో ఆఫ‌ర్లు అందిస్తున్నాయి. ఈ  సారి ఐఐటీ చరిత్రలో అత్యధిక ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్న విద్యా సంస్థ‌గా  ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- ఖరగ్ పూర్ నిలిచింది. ఈ ఏడాది దాదాపు 1100 మందికి పైగా విదార్థులు క్యాంప‌స్ ప్లేస్ మెంట్ లో ఆఫర్లను అందుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

కరోనా మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ, ఐఐటీ ఖరగ్​పూర్​ లో అసాధారణ స్థాయిలో ప్రీ ప్లేస్ మెంట్ ఆఫర్లను జ‌రిగిన‌ట్లు తెలిపింది. ఐఐటీ ఖరగ్​పూర్ ను సందర్శించిన రిక్రూటర్లలో  హనీవెల్, ఐబిఎమ్, శామ్ సంగ్, క్వాల్కామ్, అమెరికన్ ఎక్స్ ప్రెస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఉబెర్, ఇంటెల్ వంటి 100కి పైగా అంత‌ర్జాతీయ సంస్థ‌లు పాల్గొన్న‌ట్టు తెలిపారు. ఇది భారతదేశంలోని అన్ని ఇతర ఉన్నత విద్యా సంస్థలలో పోలిస్తే చాలా ఎక్కువ అని ఖరగ్​పూర్​ ఐఐటీ తెలిపింది.

 ఇందులో ఇద్ద‌రు విద్యార్థుల‌కు కోట్ల రూపాయ‌ల ప్యాకేజీని అందుకున్నారు. వారు సంవ‌త్సరానికి రూ. 2 నుంచి 2.4 కోట్ల ప్యాకేజీ పొందనున్నారు. అలాగే మ‌రో 20 మందికి పైగా కోటి రూపాయాల జీతాన్ని ఆఫర్ చేసిన‌ట్టు కళాశాల పేర్కొంది. డిసెంబర్ ఒక‌టి నుంచి మూడు రోజుల పాటు ప్లేస్ మెంట్ సెషన్ కొనసాగిందని, బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్, కోర్ ఇంజనీరింగ్, సాఫ్ట్ వేర్, ఎనలిటిక్స్ అన్ని రంగాలలో నియామక ప్రక్రియలో పాల్గొన్నట్లు ఐఐటి-ఖరగ్ పూర్ ప్రతినిధి తెలిపారు.

దీంతో క్యాంప‌స్ ఫ్లేస్ మెంట్స్ లో అత్య‌ధిక ప్యాకేజీ పొందిన విద్యాసంస్థ‌గా ఐఐటీ ఖరగ్‌పూర్ రికార్డు సృష్టించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ లో  క్యాంప‌స్ ఫ్లేస్ మెంట్స్ లో అత్య‌ధికంగా ఏడాదికి రూ.2.40 కోట్లు అందుకుంటున్నారు. ఇక ఐఐటీ గౌహతి సంవత్సరానికి 2.05 కోట్లు, ఐఐటీ ఢిల్లీకి ఏడాదికి కోటి రూపాయలు, ఐఐటీ బాంబే ఏడాదికి రూ.2.05 కోట్లు, ఐఐటీ BHU సంవత్సరానికి 2 కోట్లు, ఐఐటీ మద్రాస్ రూ. సంవత్సరానికి 70 లక్షలతో ప్యాకేజీ అందుకున్నారు విద్యార్దులు.
 

Follow Us:
Download App:
  • android
  • ios