ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 5జీ స్పెక్ట్రం వేలానికి మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. మార్చి 5న 5జీ స్పెక్ట్రం వేలం వేయనుంది.

దీని ద్వారా రూ.3,92,332 కోట్ల ఆదాయం సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. స్పెక్ట్రం వేలానికి సంబంధించిన కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

20 ఏళ్ల కాలపరిమితితో వేలం జరగనుంది. టెలికాం శాఖ గుర్తించిన కొన్ని ఫ్రీక్వెన్సీలను ఇప్పటికే రక్షణ మంత్రిత్వ, అంతరిక్ష శాఖలు వినియోగించుకుంటున్నాయి.