తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం నాడు ఒక్క రోే 12 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 20కి చేరుకొన్నాయి. కరోనా ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రకటించారు.
హైదరాబాద్: Telangana రాష్ట్రంలో కరోనా Omicron కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. శనివారం నాడు కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరుకొంది. దేశంలో కూడా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి పెరిగిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఆయా రాష్ట్రాల వైద్యశాఖాధికారులు ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. South Africaలో వెలుగు చూసిన కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాపించింది. Shamshabad International Airport లో దిగిన 12 మంది అంతర్జాతీయ ప్రయాణీలకు ఒమిక్రాన్ సోకిందని వైద్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనవాసరావు శనివారం నాడు ప్రకటించారు. ఈ 12 మందిలో తొమ్మిది మంది విదేశీయులు. మిగిలిన ముగ్గరు భారతీయులు అని వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు.ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుండి వచ్చిన ప్రయాణీకుల నుండి తొలుత కరోనా పరీక్షలు నిర్వహించేవారు. అయితే ఆ తర్వాత నిబంధనను మార్చారు. కరోనా ఒమిక్రాన్ కేసులు నమోదు కాని దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణీకులకుఎయిర్ పోర్టుల్లో పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి చేస్తున్నారు.
also read:Omicron Lockdown: నేటి నుంచి అక్కడ కఠిన లాక్‌డౌన్.. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో జనవరి 14 వరకు ఆంక్షలు..
తెలంగాణ రాష్ట్రంలో నమోదైన 20 ఒమిక్రాన్ కేసుల్లో నాలుగు కేసులు మాత్రమే కరోనా ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుండి వచ్చిన ప్రయాణీకుల్లో కేవలం నలుగురికి మాత్రమే ఈ వైరస్ ఉన్నట్టుగా తేలింది. మిగిలిన 16 మంది నాన్ రిస్క్ దేశాల నుండి వచ్చినవారేనని వైద్య ఆరోగ్యశాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.Hyderabad బంజారాహిల్స్‌లో Paramount కాలనీలో నివసిస్తున్న వారి నుండి శుక్రవారం వరకు 650 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. శనివారం నాడు ఒక్క రోజే మరో 150 శాంపిల్స్ సేకరించారు. ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుండి శనివారం వరకు నగరానికి 315 మంది ప్రయాణీకులు వచ్చారు. వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు.
విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకుల్లో కరోనా సోకితే గచ్చిబౌలిలోని టిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. మరో వైపు ఒమిక్రాన్ రోగులకు కూడా ఇదే ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. శనివారం నాడు సాయంత్రం వరకు ఏడుగురు ఒమిక్రాన్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు ఒమిక్రాన్ సోకిన ఏడుగురు రోగులను డిశ్చార్జ్ చేసినట్టుగా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో కెన్యా నుండి ఆరుగురు, సోమాలియా నుండి ఇద్దరు యూఏఈ నుండి ఇద్దరు, ఘనా నుండి 1, టాంజానియా నుండి 1 వచ్చారని వైద్య ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. గతంలో బయటపడిన Delta కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారి కోవిడ్ కేసుల్లో 2.4 శాతం ఈ వేరియంట్ కేసులేనని తెలిపారు.
హాట్‌స్పాట్ గా మారిన పారామౌంట్ కాలనీ
హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని పారామౌంట్ కాలనీ హాట్‌స్పాట్ గా మారింది. విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకులు వైద్యం కోసం, ఇతరత్రా అవసరాల రీత్యా హైద్రాబాద్ కు వచ్చారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఎక్కువ మంది పారామౌంట్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఈ కారణంగానే పారామౌంట్ కాలనీలోని సుమారు వెయ్యి మందికి పైగా పరీక్షలు నిర్వహించినట్టుగా వైద్య శాఖాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ కేసులు సోకిన వారి నుండి ప్రైమరీ కాంటాక్టుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖాధికారులు సేకరిస్తున్నారు.
