నేడు కొలువుదీరనున్న తెలంగాణ కొత్త అసెంబ్లీ.. ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేలు..
telangana assembly sessions : తెలంగాణ నూతన శాసన సభ తొలి సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీని కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రొటెం స్పీకర్ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో నేడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ సమావేశాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
telangana first assembly sessions : తెలంగాణ నూతన శాసన సభ నేడు కొలువు దీరనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలందరూ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమావేశాల కోసం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. 2023 డిసెంబర్ 9న ఉదయం 11 గంటలకు పబ్లిక్ గార్డెన్స్ లోని అసెంబ్లీ హాల్లో తొలి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని ఆ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ సమావేశాల కంటే ముందుగా ప్రొటెమ్ స్పీకర్ తో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెమ్ స్పీకర్ గా ఎన్నికైన నేపథ్యంలో రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఆయనతో ఉదయం 8.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
CM Revanth Reddy: నడిరాత్రి నా ఇంటిపై లాఠీలు పడి.. నన్ను నిర్బంధించి.. : సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్
అనంతరం ఉదయం 11 గంటలకు శాసన సభ సమావేశాలు మొదలవుతాయి. ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కొత్త శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాగా.. ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ తరుఫున గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజా సింగ్ దూరంగా ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ హాస్పిటల్ చికిత్స పొందుతుండగా.. ప్రొటెమ్ స్పీకర్ గా అక్బరుద్దీన్ నియమించిన కారణంగా తాను శనివారం ప్రమాణ స్వీకారం చేయబోనని రాజా సింగ్ ఇది వరకే ప్రకటించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార ప్రక్రియ పూర్తయిన తరువాత శాసన సభ స్పీకర్ కోసం నేటి సాయంత్రం నోటిఫికేషన్ విడుదలవుతుంది.
Potato: పొటాటో అంటే ఉల్లిగడ్డలే కదా!.. సీఎం జగన్ వ్యాఖ్యలు వైరల్.. ‘అది రాయలసీమ యాస’
స్పీకర్ పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో మొదటి రోజు సమావేశాలు ముగుస్తాయి. మళ్లీ ఆదివారం స్పీకర్ ను సభ్యులందరూ ఎన్నుకుంటారు. సోమవారం జరిగే సమావేశాల్లో తెలంగాణ గవర్నర్ తమిళసై శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మంగళవారం మళ్లీ సభ మొదలై, గవర్నర్ తీర్మానానికి సభ్యులందరూ ధన్యవాదాలు తెలుపుతారు. అనంతరం శాసన సభ నిరవదికంగా వాయిదా పడే అవకాశం ఉంది.
Revanth Reddy: వ్యవసాయానికి 12 గంటలే ఇచ్చాం: సీఎం రేవంత్‌కు విద్యుత్ సంస్థల వివరణ
కాగా.. ఈ శాసన సభ సమావేశాల నేపథ్యంలో భద్రత కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ అసెంబ్లీకి నాలుగు కిలోమీటర్ల పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సభలు, బహిరంగ సభలను నిషేధించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది.