Asianet News TeluguAsianet News Telugu

Potato: పొటాటో అంటే ఉల్లిగడ్డలే కదా!.. సీఎం జగన్ వ్యాఖ్యలు వైరల్.. ‘అది రాయలసీమ యాస’

ఆంధ్రప్రదేశ్‌లో పొటాటో పొట్లాట జరిగింది. తిరుపతిలో తుఫాన బాధితులకు కూరగాయలు అందిస్తుండగా జగన్ పొటాటో అంటే ఉల్లిగడ్డనే కదా.. అని అన్నారు. ఆ తర్వాత సరి చేసుకుని బంగాళాదుంప అని చెప్పారు. ఈ వీడియో వైరల్ అవుతున్నది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య సోషల్ మీడియాలో కామెంట్ల పోరు జరుగుతున్నది.
 

andhra pradesh cm ys jaganmohan reddy potato comment viral on social media, chandrababu reacts, ysrcp workers explanation kms
Author
First Published Dec 8, 2023, 11:50 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం పొటాటోకు రాజకీయంగా ప్రాధాన్యత లభించింది! మిచౌంగ్ తుఫాన్ బాధితులను పరామర్శిస్తూ సీఎం జగన్ శుక్రవారం తిరుపతి వెళ్లారు. అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూరగాయాలు అందిస్తుండగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య పొటాటో పొట్లాటకు తెరలేపింది.

కూరగాయలు పంచుతుండగా.. కేజీ ఉల్లిగడ్డ అని జగన్ అన్నారు. దీంతో ఆనియన్ అనే మాటలు వినిపిస్తూ సందేహం తెలుపగా.. సీఎం జగన్ మళ్లీ అందుకుని పొటాటోని ఉల్లిగడ్డనే అంటారు కదా అని అన్నారు. దీంతో అక్కడున్నవారు బంగాళాదుంప అని అరిచారు. సీఎం జగన్ తమాయించుకుని ఆ.. కేజీ బంగాళాదుంప అని వివరించారు. సీఎం జగన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. టీడీపీ శ్రేణులు ఈ వీడియో పెట్టి సీఎం జగన్ పై విమర్శలు సంధించారు. ఉల్లిగడ్డకు బంగాళాదుపంకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడని విరుచుకుపడ్డారు. జగన్‌కు సీమలో పలికే ఉల్లగడ్డ అంటే తెలియదని, ఆంధ్రాలో పలికే బంగాళాదుంప అంటే ఏమిటో కూడా తెలియదని, ఏ యాసా తెలియని జగన్ కొత్త పదాలు కనిపెడుతున్నాడని వ్యంగ్యంపోయారు.

 

Also Read: Telangana Movement: రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఉద్యమ కేసులపై ఆదేశాలు

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా జగన్ కామెంట్‌ను ఓ కార్యక్రమంలో ఉటంకించి విమర్శించారు. పొటాటోను తెలుగులో ఏమంటారో కూడా తెలియని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని విమర్శలు చేశారు.

టీడీపీ వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది. రాయలసీమలో బంగాళాదుంపని ఉల్లగడ్డ అనే పిలుస్తారని, ఉల్లిపాయను ఎర్రగడ్డ అని పిలుస్తారని వివరించింది. సీమలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలిసి ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. సీమ యాస, భాష పట్ల అవగాహన లేని మిమ్మల్ని ప్రజలు పక్కన బెట్టారని, 2019లో 3 సీట్లే వచ్చాయని వైసీపీ శ్రేణులు ఫైర్ అయ్యాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios