Asianet News TeluguAsianet News Telugu

Narendra Modi..ఉత్తరకాశీ టన్నెల్ లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అన్ని చర్యలు: హైద్రాబాద్‌లో మోడీ

మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  చివరి రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

 Government Take all steps to Rescue workers in Uttarkashi tunnel:Narendra modi lns
Author
First Published Nov 27, 2023, 8:55 PM IST

హైదరాబాద్:ఉత్తరాఖండ్ టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ  చెప్పారు.

సోమవారంనాడు  హైద్రాబాద్ లో ఓ ప్రైవేట్ టీవీ చానెల్ నిర్వహించిన కోటీ దీపోత్సవం  కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.  ప్రకృతి సహకరించకున్న టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని  ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మోడీ చెప్పారు. టన్నెల్ లో చిక్కుకున్నవారు  బయటకు రావాలని దీపం  వెలిగించాలని మోడీ కోరారు.కార్తీక పౌర్ణమి రోజున కోటిదిపోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా మోడీ పేర్కొన్నారు. ఆ దేవుడి దీవెనలతో తాను ఇవాళ ఇక్కడ ఉన్నానని ఆయన  చెప్పారు. ఇవాళ కాశీలో   దీపోత్సవం జరుగుతుందన్నారు. తాను ఇక్కడ  దీపోత్సవంలో పాల్గొన్నానని  మోడీ పేర్కొన్నారు.  కార్తీక పౌర్ణమి రోజున  తిరుమల వెంకటేశ్వరస్వామిని కూడ దర్శించుకున్నట్టుగా  మోడీ పేర్కొన్నారు.తిరుమల శ్రీనివాసుడి దర్శనభాగ్యం చెప్పలేనిదన్నారు.  ఇవాళ గురుద్వార్ ను కూడ దర్శించుకొనే భాగ్యం తనకు దక్కిందన్నారు. 

also read:Narendra Modi: హైద్రాబాద్‌ అమీర్‌పేట గురుద్వారలో మోడీ ప్రత్యేక ప్రార్థనలు

తాను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. కానీ ఈ కార్యక్రమం తనకు ప్రత్యేకమైందన్నారు.  కోటి దిపోత్సవం నిర్వహిస్తున్న టీవీ చానెల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.  శ్రీశైలం నుండి వేములవాడ వరకు  భద్రాద్రి నుండి ఆలంపూర్ వరకు ఆధ్యాత్మిక త వెల్లివిరుస్తుందని మోడీ  చెప్పారు.దీపజ్యోతి మనకు వెలుగునిస్తుంది.. చీకట్లను తొలగిస్తున్నాయన్నారు. ఈ దీపాలు ఆత్మనిర్భర్  భారత్ ను సూచిస్తాయని మోడీ పేర్కొన్నారు.

also read:హైద్రాబాద్‌లో నరేంద్ర మోడీ రోడ్ షో: ప్రధానిపై పూల వర్షం(ఫోటోలు)

ఇవాళ  రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినందుకు , శివుడు భూమిపైకి వచ్చినందుకు దీపం వెలిగిస్తామని మోడీ గుర్తు చేశారు. ఈ దీపాలు వికసిత భారత్ ను ప్రతిబింబిస్తాయని మోడీ పేర్కొన్నారు.

 

ఈ రోజు వెలిగించే దీపాలకు మరో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ దీపాలు ఆత్మనిర్భర్  భారత్ ను సూచిస్తాయన్నారు. పోతన, నన్నయ్య, ఎర్రాప్రగడ,తిక్కన వంటి కవులు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారని మోడీ పేర్కొన్నారు.  కాశీ, ఉజ్జయిని ఆలయాను  అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. అనంతరం కార్తీక దీపాన్ని వెలిగించారుఅంతకు ముందు భక్తులతో పాటు  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గోవిందనామస్మరణ చేశారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios