Asianet News TeluguAsianet News Telugu

Narendra Modi: హైద్రాబాద్‌ అమీర్‌పేట గురుద్వారలో మోడీ ప్రత్యేక ప్రార్థనలు


తెలంగాణలో మూడు రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  మూడు రోజుల పాటు  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హైద్రాబాద్ కు వచ్చిన సందర్భంగా అమీర్ పేట  గురుద్వారను సందర్శించారు. 

Narendra Modi offers special prayers at gurudwara in Hyderabad Ameerpet lns
Author
First Published Nov 27, 2023, 8:18 PM IST


హైదరాబాద్: నగరంలోని  అమీర్‌పేటలోని గురుద్వార్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారంనాడు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  హైద్రాబాద్ లో రోడ్ షో నిర్వహించిన తర్వాత  అమీర్ పేట గురుద్వారకు  ప్రధాని మోడీ వెళ్లారు.  స్థానికులతో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు. మోడీతో పాటు బీజేపీ శ్రేణులు కూడ గురుద్వారకు వెళ్లారు.

మూడు రోజుల పాటు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  బీజేపీ అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎన్నికల సభల్లో  మోడీ పాల్గొన్నారు.  మూడో రోజున మహబూబాబాద్ ,కరీంనగర్ లలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం హైద్రాబాద్ లో బీజేపీ రోడ్ షోలో మోడీ పాల్గొన్నారు.ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి కాచిగూడ క్రాస్ రోడ్డు వరకు  మోడీ రోడ్ షో నిర్వహించారు. 
మూడు కి.మీ. పాటు రోడ్ షో నిర్వహించారు. 

తెలంగాణలో ఈ దఫా  అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. తెలంగాణలో  బీజేపీ అగ్రనేతలు గత రెండు మూడు రోజులుగా విస్తృతంగా  ప్రచారం నిర్వహిస్తున్నారు.  కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో  విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.  

also read:Narendra Modi..ఉత్తరకాశీ టన్నెల్ లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అన్ని చర్యలు: హైద్రాబాద్‌లో మోడీ

గత ఎన్నికల్లో బీజేపీ  ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైంది. అయితే  2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.  దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ విజయం సాధించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ  గణనీయమైన కార్పోరేట్ సీట్లను దక్కించుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో  అధికారాన్ని కైవసం చేసుకోవాలని కమల దళం వ్యూహరచన చేస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios