Asianet News TeluguAsianet News Telugu

ఆ ఫోన్లను అప్ గ్రేడ్ చేసుకోండి.. లేకపోతే 2020లో వాట్సాప్​ సేవలు బంద్​

తమ వినియోగదారులకు షాకిచ్చింది వాట్సాప్​. వచ్చే ఏడాది నుంచి కొన్ని ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ ఫోన్లకు సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. విండోస్​ ఫోన్లకు మాత్రం పూర్తిగా సేవలు విరమించుకోనున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. 

WhatsApp to stop working on many phones from Jan 1 but your phone is probably alright
Author
Hyderabad, First Published Dec 15, 2019, 2:42 PM IST

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్లతో ఆకట్టుకునే సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్.. తాజాగా కస్టమర్లకు షాకిచ్చింది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్​తో పని చేసే కొన్ని స్మార్ట్​ఫోన్లకు సేవలు నిలిపేయనున్నట్లు తెలిపింది. ఏఏ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయో పరిశీలిద్దాం..  

వర్షన్​ 2.3.7 కన్నా తక్కువ ఓఎస్​తో పనిచేస్తున్న అన్ని అండ్రాయిడ్ ఫోన్లకు వాట్సాప్​ సేవలు 2020 ఫిబ్రవరి 1 నుంచి ముగియనున్నాయి. ఈ ఓఎస్​​ ఫోన్లు గల కస్టమర్లు వాట్సాప్​ను ఉపయోగించాలంటే కొత్త మోడల్ ఫోన్లకు అప్​గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.

అమెజాన్ అలెక్సాతో బోట్ స్టోన్ పోర్టబుల్ స్పీకర్

ఐఓఎస్​ 8, అంతకన్నా తక్కువ ఓఎస్​ వెర్షన్లతో పని చేసే అన్ని ఆపిల్​ ఫోన్లలోనూ వాట్సాప్​ సేవలు నిలిచిపోనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ ఫోన్లకు నుంచి ఇది వర్తిస్తుంది.

విండోస్​ ఫోన్లకు మాత్రం 2020 జనవరి 1 నుంచి పూర్తిగా సేవలు ఆగిపోనున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రస్తుతం విండోస్​ యూజర్లు వచ్చే ఏడాది నుంచి వాట్సాప్​ వాడాలంటే ఆండ్రాయిడ్​కుగానీ, ఐఓఎస్​కు గానీ మారక తప్పని పరిస్థితి నెలకొంది.

మీరు పాత ఫోన్లు వాడుతున్నట్లయితే సెట్టింగ్స్​లో వాట్సాప్​ ప్రకటించిన వెర్షన్లలో మీ ఫోన్​ ఉందోలేదో తెలుసుకుంటే సరిపోతుంది. ఒక వేళ మీ ఫోన్​ మోడల్​​ ఆ జాబితాలో ఉంటే మీ వాట్సాప్​ డేటా మొత్తం బ్యాకప్​ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని ఫోన్లలో వాట్సాప్​ సేవలు నిలిచిపోనున్నా పెద్దగా భయపడాల్సిన పనిలేదని టెక్​ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది కనీసం రెండేళ్లకోసారి ఫోన్​ను మారుస్తున్నందున వాటిలో పాత వెర్షన్​ ఓఎస్ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. 

ఫోన్‌పే యాప్ ద్వారా ఇప్పటివరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయో తెలుసా...?

అండ్రాయిడ్​, ఐఓఎస్​ పాత వెర్షన్​ ఫోన్లు వాడే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని, వారు మాత్రం కొత్త మోడల్​కు అప్​గ్రేడయితే సరిపోతుందని అంటున్నారు. విండోస్​ ఫోన్​ యూజర్లు మాత్రం తప్పని సరిగా అండ్రాయిడ్ గానీ,  ఐఓఎస్​కుగానీ మారక తప్పదని సూచిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios