ఫేస్‌బుక్, వాట్సాప్ కంపెనీల ప్రైవసీ పాలసీపై హైకోర్టు ఆందోళన.. దర్యాప్తు చేయాలని ఆదేశం..

ఫేస్‌బుక్, వాట్సాప్‌ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కేసు వాస్తవాలను కోర్టుకు తెలియజేస్తూ, కొత్త గోప్యతా విధానం వినియోగదారుల డేటాను పంచుకోకుండా స్వేచ్ఛను ఇస్తుందని, కొత్త పాలసీపై ఎటువంటి బలవంతం చేయదని అన్నారు.

High Court expressed concern over the privacy policies of social media companies like Facebook and WhatsApp

ఇన్స్టంట్ మెసేజింగ్ అండ్ ఫోటో, వీడియో షేరింగ్ యాప్ మెటా(facebook) వంటి సోషల్ మీడియా కంపెనీల గోప్యతా విధానాలపై హైకోర్టు బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది, ఈ కంపెనీలు వ్యక్తుల వ్యక్తిగత డేటాను పంచుకోవడం, స్క్రాప్ చేయడంపై దర్యాప్తు చేయాలని పేర్కొంది.

ప్రజలు తమ గోప్యత గురించి ఆందోళన చెందుతున్నారని అలాగే ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించే కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి ప్రైవేట్ సంస్థలతో సోషల్ మీడియా దిగ్గజాలు  డేటాను షేర్ చేస్తున్నాయో లేదో చాలా మందికి తెలియదని జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ పూనమ్ ఎ బాంబాతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.

కేంబ్రిడ్జ్ అనలిటికా అనేది ఫేస్‌బుక్-కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం తర్వాత వివాదంలో చిక్కుకున్న బ్రిటిష్ పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2016 బ్రెగ్జిట్ రెఫరెండం అలాగే యునైటెడ్ స్టేట్స్‌లో 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఓటింగ్ ప్యాటర్న్ ప్రభావితం చేయడానికి మిలియన్ల మంది వ్యక్తుల నుండి ఫేస్‌బుక్ డేటాను సేకరించినట్లు సంస్థపై  ఆరోపణలు వచ్చాయి.

వాట్సాప్ కొత్త గోప్యతా విధానంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఫేస్‌బుక్, వాట్సాప్ దాఖలు చేసిన అప్పీళ్లను విచారించిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఫేస్‌బుక్, వాట్సాప్‌ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కేసు వాస్తవాలను కోర్టుకు తెలియజేశారు. కొత్త గోప్యతా విధానం వినియోగదారుల డేటాను ఇతర సంస్థలతో పంచుకోకుండా స్వేచ్ఛను ఇస్తుందని ఇంకా  కొత్త గోప్యతా విధానంపై ఎటువంటి బలవంతం చేయదని అన్నారు.

ప్రభుత్వం డేటా ప్రొటెక్షన్ బిల్లును తీసుకొచ్చే వరకు ఈ పాలసీ కొనసాగుతుందని సాల్వే చెప్పారు. వాట్సాప్‌లో కమ్యూనికేషన్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడిందని, అయితే ఫేస్‌బుక్‌ ఒక వ్యక్తి జీవితాన్ని పబ్లిక్ డొమైన్‌లో ఉంచదని ఆయన అన్నారు.

సాల్వే ఈ విషయంలో అమికస్ క్యూరీగా ఉంటే బాగుండేదని, దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందని జస్టిస్ శక్ధర్ అన్నారు. Facebook ద్వారా డేటా షేరింగ్ గురించి  ఆందోళన చెందుతున్నాము. మీరు అమికస్ గా ఉంటే బాగుండేది. ఎవరైనా దీనిని పరిశీలించాలని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను.

నేను లండన్‌లో ఎన్‌డిటివి యాప్‌ని ఓపెన్ చేసినప్పుడల్లా నా భార్య షాపింగ్ లిస్ట్ నాకు వస్తుందని సాల్వే చెప్పాడు. ఈ సోషల్ మీడియా కంపెనీలు ఒక్కొక్కరిపై దాదాపు 5,000 డేటా పాయింట్లను కలిగి ఉన్నాయని సూచించే నివేదికలు ఉన్నాయని, ఏ పరిస్థితిలోనైనా అతని ప్రవర్తనను అంచనా వేయడానికి అటువంటి డేటాను ఉపయోగించవచ్చని జస్టిస్ శక్ధర్ అన్నారు. 

Facebook ద్వారా డేటాను పంచుకోవడం గురించి మేము ఆందోళన చెందుతున్నాము. తనకు ఒక స్నేహితుడు ఉన్నాడని, గోవాకు వెళ్లినప్పుడల్లా ఫేస్‌బుక్‌లో ఆ వ్యక్తి అక్కడికి వచ్చినట్లు నోటిఫికేషన్ వస్తుందని సాల్వే చెప్పాడు.

అటువంటి సమాచారాన్ని పొందడం మంచిది, అయితే గోవాలో ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో ఈ కంపెనీలు అంచనా వేయగలిగినప్పుడు సమస్య తలెత్తుతుందని జస్టిస్ షక్ధర్ బదులిచ్చారు. కోర్టు ఇప్పుడు ఈ అంశాన్ని జూలై 21కి విచారణకు వాయిదా చేసింది. తదుపరి విచారణ తేదీలోగా వ్రాతపూర్వక వాదనలను దాఖలు చేయాలని ఇరుపక్షాలను ఆదేశించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios