ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్లలో రకరకాల ఫీచర్లు వచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు ఆరాటపడుతున్నాయి.  ఇప్పటికే సెల్ఫీ కెమేరా, భారీ డిస్ ప్లే, డబుల్ కెమేరా, ట్రిపుల్ కెమేరా లాంటి ఫీచర్లను ప్రవేశపెట్టగా.. తాజాగా అద్భుతమైన మరో ఫీచర్ ను తీసుకువచ్చింది.

కేవలం మనం ముద్దుపెడితే  చాలు ఫోన్ సెల్ఫీ తీసేస్తుంది. ఈ ఫీచర్ ని గూగుల్ పిక్సెల్3 స్మార్ట్ ఫోన్ లో ప్రవేశపెట్టారు.  మీకు నచ్చినవారికి ముద్దు పెట్టారనుకోండి వెంటనే ఫోన్ దానిని ఫోటో తీస్తుంది. ఈ విషయాన్ని గూగుల్ బ్లాగ్ పోస్టులో వివరించింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో ఫోటోబూత్ అనే ఒక మోడ్ ను అందిస్తోంది. దీంట్లో కిస్ డిటెక్షన్ మోడ్ కూడా ఉంటుంది. అంతేకాదు.. 5 ముఖ్యమైన ఫీలింగ్స్ ని కూడా ఈ ఫోన్ లోని కెమేరా గుర్తించగలదు. ఫోటో తీస్తున్నపుడు..  మన కళ్లు తెరిచి ఉన్నాయా లేదా.. ఎక్స్‌ప్రెషన్స్‌ ఎలా ఉన్నాయి..   కదులుతున్నామా?  స్థిరంగా  ఉన్నామా ? అనే విషయాన్ని కూడా ఈ కెమెరా పరిశిలీస్తుందట.  అన్నీ నిర్ధారించుకున్న తరువాతే ఫోటో క్లిక్‌ చేస్తుందట.