ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. రిపబ్లిక్ డే సేల్ కి తెర లేపింది. ఈ నెల 20 నుంచి 22వ తేదీ  వరకు ఈ రిపబ్లిక్ డే సేల్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో పలు వస్తువులు, బ్రాండెడ్ దుస్తులపై అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది.

ఈ సేల్ లో భాగంగా ఎస్బీఐ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అలాగే పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందివ్వనుంది. సేల్ లో భాగంగా మొబైల్స్, ల్యాప్ టాప్స్, టీవీలపై బ్లాక్ బస్టర్ డీల్స్ ని అందివ్వనున్నారు. ఇక ప్రతి8 గంటలకు ఒకసారి రష్ అవర్స్ ఎక్స్ ట్రా డిస్కౌంట్లను అందివ్వనున్నారు.

సేల్‌లో టీవీలు, అప్ల‌యెన్సెస్‌పై 75 శాతం వ‌ర‌కు, ఎల‌క్ట్రానిక్స్‌, యాక్స‌స‌రీల‌పై 80 శాతం వ‌ర‌కు, ఇత‌ర బ్రాండ్ల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌పై 70 శాతం వ‌ర‌కు రాయితీల‌ను అందివ్వ‌నున్నారు.