తాలిబన్ల రాజ్యంలో మహిళా క్రీడలపై నిషేధం... హెచ్చరికలు పట్టించుకోకుండా వాలీబాల్ ఆడినందుకు యువక్రీడాకారిణి తల నరికి, వీధుల్లో ఊరేగించిన తాలిబన్లు...

తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆఫ్ఘాన్‌లో రోజురోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి. రక్కసి పాలనను తలపించేలా తుపాకీ నీడన దేశాన్ని పాలిస్తున్నారు తాలిబన్లు. తాలిబన్ల రాజ్యం ఏర్పడిన తర్వాత ఛీర్ గర్ల్స్‌ను టీవీల్లో చూపిస్తున్నారనే ఉద్దేశంలో దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన తాలిబన్లు, మహిళలు బహిరంగంగా క్రీడలు ఆడడంపై కూడా బ్యాన్ వేశారు...

శరీర అవయవాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవాల్సి ఉంటుందని ఆఫ్ఘాన్ మహిళా క్రికెట్ జట్టును కూడా నిషేధించిన తాలిబన్లు, తాజాగా హెచ్చరికలను ఖాతరు చేయకుండా వాలీబాల్ ఆడుతుందనే కారణంగా ఓ యువ క్రీడాకారిణిని దారుణంగా హత్య చేశారు...

పాశవిక పరిపాలనకు అద్దం పట్టేలా జరిగిన ఈ సంఘటన కాబూల్ సమీపంలోనే జరిగింది. ఆఫ్ఘాన్ అండర్-19 జాతీయ వాలీబాల్ జట్టుకి చెందిన ఓ 18 ఏళ్ల మహ్జాబిన్ హకీమా అనే క్రీడాకారిణి... తాలిబన్ల హెచ్చరికలు పట్టించుకోకుండా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. దీంతో ఆమెను బంధించిన తాలిబన్లు, చిత్రహింసలు చేసి తల నరికి వీధుల్లో ఊరేగించారట.

తమ హెచ్చరికలను పట్టించుకోకుండా మహిళలు, అమ్మాయిలు ఎవరైనా ఆటలు ఆడాలని ప్రయత్నిస్తే, వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆఫ్ఘాన్ అండర్19 వాలీబాల్ కోచ్ సురాయా ఆఫ్జాలీ చెప్పే వరకూ ప్రపంచానికి తెలియకపోవడం విశేషం...

తాలిబన్లకు బయటికి అప్పటికే ఇద్దరు మహిళా వాలీబాల్ ప్లేయర్లు దేశం విడిచి పారిపోగా, ఆర్థిక స్థోమత సరిగా లేని క్రీడాకారులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారట...

Must READ: T20 worldcup 2021: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... రోహిత్, కెఎల్ రాహుల్...

T20 worldcup 2021: రోహిత్ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా కోహ్లీ... వార్మప్ మ్యాచ్‌లో విరాట్ బౌలింగ్‌‌పై...

రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

నేను, విరాట్, సూర్య... అవసరమైతే మేం ముగ్గురం బౌలింగ్ చేస్తాం... రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మోత మోగించిన సిక్సర్ల వీరులు వీరే... యువరాజ్ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..

ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...

టీ20 వరల్డ్‌కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్‌?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...