- Home
- Sports
- Cricket
- ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...
ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...
ఐపీఎల్ నుంచి టీమిండియాలోకి దూసుకొచ్చినవారిలో హార్ధిక్ పాండ్యా ఒకడు. ఆరంగ్రేటం నుంచే బాల్‌తో, బ్యాటుతో రాణించి స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన హార్దిక్ పాండ్యా, కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టుతో పాండ్యా ప్లేస్ అనుమానంలో పడింది...

ఫిట్‌గా లేని హార్ధిక్ పాండ్యా బౌలింగ్ వేయలేకపోతే, అతనికి తుది జట్టులో స్థానం ఇవ్వడమే అనవసరమని కామెంట్లు చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. అతని స్థానంలో మరో ప్లేయర్‌ను ఆడిస్తే బెటర్ అని సూచిస్తున్నారు...
ధోనీ రిటైర్మెంట్ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఇది. అదీకాకుండా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే మొట్టమొదటి, చివరి టీ20 వరల్డ్ కప్ కూడా...
‘ఈసారి మాహీ భాయ్ లేకుండా ఆడబోతున్నాం. ఇది మాకు చాలా పెద్ద ఛాలెంజ్. మాహీ నా పక్కనుంటే నాకు కొండంత బలం వచ్చినట్టుగా ఉంటుంది. నా మొదటి మ్యాచ్ నుంచి మాహీ ఇచ్చిన సహాయ సహకారాలు మరిచిపోలేనివి...
మాహీ భాయ్ అందర్నీ భలేగా అర్థం చేసుకుంటాడు. ఎవరిని ఎలా మోటివేట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. నేను ఎలా ఆలోచిస్తానో కూడా నాకంటే బాగా మాహీ భాయ్ చెప్పేయగలరు..
2019 న్యూజిలాండ్ టూర్‌లో ఓ టీవీ షోలో పాల్గొన్నాను. అక్కడ చేసిన కామెంట్ల వల్ల నాపై బ్యాన్ పడింది. దాంతో అప్పటికే న్యూజిలాండ్‌లో ఉన్న నాకు హోటల్ రూమ్ ఇవ్వలేదు...
అప్పుడు మాహీ నుంచి కాల్ వచ్చింది. నేను బెడ్ మీద పడుకోను. నువ్వు నా బెడ్ మీద పడుకో, నేను ఇక్కడే కింద పడుకుంటానని మాహీ భాయ్ చెప్పారు...
ఆ మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏ కష్టం వచ్చినా, నేను మొదట ఫోన్ చేసేది మాహీ భాయ్‌కే. నాకు నిజంగానే ఆవేశం కాస్త ఎక్కువ. కానీ మాహీ భాయ్ ఉంటే నేను చాలా కామ్‌గా ఉంటాను...
‘కాఫీ విత్ కరణ్ షో’ ప్రోగ్రామ్ కాంట్రవర్సీ తర్వాత నేను బాగా కృంగిపోయాను. నన్ను దగ్గర తీసుకుని, మనస్ఫూర్తిగా ఏడవనిచ్చే ఓ భుజం ఉంటే చాలనుకున్నా... నా క్రికెట్ కెరీర్‌లో మాహీ భాయ్ అలాంటి సాయం ఎన్నోసార్లు చేశారు...
ఆయన్ని ఓ గొప్ప వ్యక్తిగా నేనెప్పుడూ చూడను. ఎందుకంటే మాహీ భాయ్ నాకు అన్నయ్య. నాకు ఏం అనిపించినా, వెంటనే ఆయనకి ఫోన్ చేసి, ఇలా అనిపించింది, ఏం చేయమంటారని అడిగేస్తా...
ఎందుకంటే ఆయన నాకు కెప్టెన్ మాత్రమే కాదు, నా లైఫ్ కోచ్ కూడా... నేను తప్పు చేస్తే, తప్పు చేస్తున్నావని ఆయన చెప్పేస్తారు కూడా...’ అంటూ కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా...
‘నా కెరీర్ సున్నాతో మొదలైంది. ఇప్పుడు చాలా లగ్జరీ లైఫ్ జీవిస్తున్నా. ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి,కోట్లు సంపాదిస్తే... తాను ఒక్కడే ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టాలని అనుకోడు...
ఎందుకంటే ప్రతీ మనిషికి డబ్బు ముఖ్యం, అవసరం. క్రికెట్ వల్లే నేనీ స్థాయికి చేరుకున్నా. లేదంటే ఏదో పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ ఉండేవాడిని...
డబ్బులతో అన్ని కొనలేమని చాలామంది అంటూ ఉంటారు. నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే డబ్బులే లేకపోతే, డబ్బులే రాకపోతే ఇంతమంది క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేవాళ్ళు కూడా కాదు...
ఐపీఎల్‌లో వచ్చే కోట్ల వల్ల ప్లేయర్లు, మరింత కష్టపడేందుకు ఇష్టపడుతున్నారు. డబ్బులే మనిషికి కావాల్సిన మోటివేషన్‌ని ఇస్తున్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా...