MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • T20 worldcup 2021: రోహిత్ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా కోహ్లీ... వార్మప్ మ్యాచ్‌లో విరాట్ బౌలింగ్‌‌పై...

T20 worldcup 2021: రోహిత్ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా కోహ్లీ... వార్మప్ మ్యాచ్‌లో విరాట్ బౌలింగ్‌‌పై...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియాను వెంటాడుతున్న సమస్య ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్... హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేకపోవడంతో ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం వెతుకుతోంది భారత జట్టు...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Oct 20 2021, 08:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

T20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియాను వెంటాడుతున్న సమస్య ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్... హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేకపోవడంతో ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం వెతుకుతోంది భారత జట్టు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అందరికీ సడెన్ సర్‌ప్రైజ్‌గా అనిపించిన విషయం విరాట్ కోహ్లీ బౌలింగ్... రెండో వార్మప్ మ్యాచ్‌లో విరాట్ విశ్రాంతి తీసుకోవడంతో  రోహిత్ శర్మ  కెప్టెన్‌గా వ్యవహరించాడు.. 

311

అయితే రిషబ్ పంత్, మాహీతో వికెట్ కీపింగ్ మెలకువలు నేర్చుకోవడంలో బిజీగా ఉండడం, భువీ కూడా బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడడంతో సబ్‌స్టిట్యూట్‌గా క్రీజులోకి వచ్చాడు విరాట్ కోహ్లీ...

411

క్రీజులోకి వస్తూనే రెండు బౌండరీలను ఆపి, తన స్టైల్‌ మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలు చూపించిన విరాట్ కోహ్లీ, ఆ వెంటనే బౌలింగ్ చేయాలని భావించాడు..

511

కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీతో బౌలింగ్ చేయించాడంటూ ఐసీసీ... విరాట్ బౌలింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం విశేషం...

611

మొదటి ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చిన విరాట్ కోహ్లీ, రెండో ఓవర్‌లో ఓ ఫోర్ ఇచ్చినా, 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఆకట్టుకున్నాడు...

711

విరాట్ కోహ్లీ వేసిన స్వింగ్ బౌలింగ్‌‌కి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ అయిన స్టీవ్ స్మిత్ ఆశ్చర్యపోయి, అలా చూస్తూ ఉండడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది...

811

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా ఆడతాడని సోషల్ మీడియాలో ప్రచారం కూడా మొదలైపోయింది...

911

శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జడేజా, భువనేశ్వర్ కంటే మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ... ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్నాడు...

1011

యువరాజ్ సింగ్, సురేష్ రైనా వంటి మాజీ ప్లేయర్ల తర్వాత టీమిండియా తరుపున టీ20ల్లో అత్యుత్తమ ర్యాంకులో కొనసాగుతున్న భారత ఆల్‌రౌండర్ విరాట్ కోహ్లీయే కావడం విశేషం...

1111

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఓ పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా విరాట్ కోహ్లీ సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం మొదలైపోయింది...

\

ఇవీ చదవండి: రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

నేను, విరాట్, సూర్య... అవసరమైతే మేం ముగ్గురం బౌలింగ్ చేస్తాం... రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మోత మోగించిన సిక్సర్ల వీరులు వీరే... యువరాజ్ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..

ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...

టీ20 వరల్డ్‌కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్‌?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL Qualifier 2, GT vs RR : గిల్ దెబ్బకు రాజస్థాన్ విలవిల... గుజరాత్ విజయానికి ప్రధాన కారణాలివే
Recommended image2
Vaibhav Sooryavanshi :100 మిస్సైతేనేంరా బుడ్డోడా, 1000 కొట్టేశావుగా : శతకం కాదు వైభవ శకమే..!
Recommended image3
IPL 2026: పాకిస్థాన్‌లోనూ వైభవ్ సూర్యవంశీ క్రేజ్.. మాములుగా లేదు మనోడి రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved