Asianet News TeluguAsianet News Telugu

T20 worldcup 2021: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... రోహిత్, కెఎల్ రాహుల్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ రెండో వార్మప్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకున్న టీమిండియా... రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ...

T20 worldcup 2021:  india beats Australia in second warm-up in t20 worldcup 2021
Author
India, First Published Oct 20, 2021, 6:55 PM IST

T20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు రెండు వార్మప్ మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకుంది. ప్రత్యర్థి బౌలర్లపై అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ, దుమ్మురేపారు భారత బ్యాట్స్‌మెన్. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది...

153 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టుకి ఓపెనర్లు కెఎల్ రాహుల్,  రోహిత్ శర్మ కలిసి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 31 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులుచేసిన కెఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత రోహిత్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా కలిసి మ్యాచ్‌ను ముగించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేయగా... సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేశాడు...

హార్ధిక్ పాండ్యా 8 బంతుల్లో 14 పరుగులు చేసి సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించాడు. రెండు వార్మప్ మ్యాచుల్లోనూ విజయాలు అందుకున్న విరాట్ సేన, హాట్ ఫెవరెట్‌గా అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది...

వరుసగా రెండు వార్మప్ మ్యాచుల్లోనూ పటిష్టమైన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లను చిత్తు చేసిన భారత జట్టు... విజయోత్సహంతో పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ విజయం, టీమిండియా ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ పెంచుతుందా? లేక ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తుందా? అనేది తేలియాల్సి ఉంది...

ఎందుకంటే ఈ రెండు వార్మప్ మ్యాచుల్లోనూ భారత జట్టు, ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చూపించింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో బౌలర్లు భారీగా పరుగులిచ్చినా, ఆసీస్‌తో మ్యాచ్‌లో అది కూడా జరగలేదు. అదీకాకుండా మనవాళ్ల బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా కనిపించింది...

అలాకాకుండా వెంటవెంటనే రెండు, మూడు వికెట్లు కోల్పోతే, మిడిల్ ఆర్డర్ ఎలా బ్యాటింగ్ చేస్తుందనేది పరీక్షించేందుకు సరైన అవకాశం దొరకలేదు. ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న మిడిల్ ఆర్డర్‌లో సమస్యలు తగ్గాయా? లేదా? అనేది తేలేందుకు అవసరమైన ప్రాక్టీస్ అయితే, ఈ రెండు వార్మప్ మ్యాచుల్లోనూ టాపార్డర్ రాణించడం వల్ల దొరకలేదు... సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా... కీలక సమయంలో రాణించడాన్ని బట్టి, టీమిండియా ఐసీసీ టైటిల్ ఆశలు ఆధారపడి ఉంటాయి...

 

ఇవీ చదవండి: రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

నేను, విరాట్, సూర్య... అవసరమైతే మేం ముగ్గురం బౌలింగ్ చేస్తాం... రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మోత మోగించిన సిక్సర్ల వీరులు వీరే... యువరాజ్ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..

ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...

టీ20 వరల్డ్‌కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్‌?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...

Follow Us:
Download App:
  • android
  • ios