Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ కు పివి సింధు...స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ విజేత పివి సింధు హైదరాబాద్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.  

World Champion PV Sindhu receives a grand welcome at hyderabad Airport
Author
Hyderabad, First Published Aug 27, 2019, 8:31 PM IST

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ విజేత పివి సింధు హైదరాబాద్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు చాముండేశ్వరినాథ్ లు ఆమెకు స్వాగతం పలికారు. సింధుతో పాటు కోచ్ గోపీచంద్ కు సాదర స్వాగతం లభించింది.

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ విజేత పివి సింధు హైదరాబాద్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు చాముండేశ్వరినాథ్ లు ఆమెకు స్వాగతం పలికారు. సింధుతో పాటు కోచ్ గోపీచంద్ కు సాదర స్వాగతం లభించింది.

వరల్డ్ ఛాంపియన్ పివి సింధు, కోచ్ గోపిచంద్ లు నేరుగా డిల్లీకి చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో కూడా వారికి ఘన స్వాగతం లభిచింది. ఆ తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా మంత్రి కిరణ్ రిజుజును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ సింధును అభినందించడమే కాదు తన చేతులతో మరోసారి ఆమె మెడలో గోల్డ్ మెడల్ వేశారు. అంతేకాకుండా క్రీడా శాఖ ప్రకటించిన రూ.10 లక్షల నజరానాకు చెందిన చెక్ ను మంత్రి రిజుజు సింధు కు అందించారు. 

ఇలా డిల్లీలో కార్యక్రమాలన్నింటిని ముగించుకుని సింధు సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్  కు బయలుదేరారు.నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు మంత్రి  శ్రీనివాస్ గౌడ్ సాదరంగా స్వాగతం పలికారు. సింధుతో పాటు గోపించంద్ కు మంత్రి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ వరల్డ్ ఛాంపియన్ సింధు కు ప్రత్యేకంగా అభినందించారు. 

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో సింధు జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించి విజేతగా నిలిచింది.  ఈ మ్యాచ్ ఆరంభంనుండి సింధు దూకుడుగా ఆడుతూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దీంతో మొదటి రౌండ్ ను 21-7 పాయింట్ల తేడాతో గెలుచుకుంది. రెండో రౌండ్లో కూడా ఏ మాత్రం దూకుడు తగ్గించని సింధు సేమ్ ఫలితాన్ని రాబట్టింది. దీంతో 21-7, 217 తేడాతో ఓడించి మొదటిసారి వరల్డ్ ఛాంపియన్ షిప్ ను చేజిక్కించుకుంది. ఇలా కేవలం 36 నిమిషాల్లోనే సింధు విజయయాత్ర ముగియడం విశేషం.   

వీడియో

సంబంధిత వార్తలు

 అలా ప్రశ్నించేవారికి ఇదే నా సమాధానం: పివి సింధు సీరియస్

చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం

2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు

 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా పివి సింధు... విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పివి సింధు... కేటీఆర్, హరీష్‌ల అభినందనలు

Follow Us:
Download App:
  • android
  • ios