నిన్న గాక మొన్న యూఏఈలో జరిగిన ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి టీమిండియా ఏడోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ల విజయాన్ని చూసి స్పూర్తి పొందారేమో..? కుర్రాళ్లు కూడా వారి దారిలోనే నడిచారు.

అండర్-19 ఆసియా కప్‌ను యంగ్ ఇండియా చేజిక్కించుకుంది.. ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 144 పరుగులతో తేడాతో లంకేయులను ఓడించింది. ఢాకాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 85, అనూజ్ రావత్ 57తో తొలి వికెట్‌కు శుభారంభాన్ని అందించారు.

అనంతరం కెప్టెన్ సిమ్రన్ సింగ్ 65, ఆయుషో బదోని 52 సుడిగాలి ఇన్నింగ్స్‌తో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు చెందిన శ్రీలంక ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. ముఖ్యంగా హర్ష్ త్యాగి, సిద్ధార్థ్ దేశాయ్‌లు స్పిన్ మాయాజాలంతో లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు.  భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంక 38.4 ఓవర్లలో 160 పరుగులకు అలౌట్ అయ్యింది.

హర్ష్ త్యాగికి ‘ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా.. ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలతో టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డ్ దక్కింది. మరోవైపు భారత్ ఆసియా కప్ అండర్-19 టైటిల్ నెగ్గడం ఇది ఆరోసారి.. ఇంతకు ముందు 1989, 2003, 2012, 2014, 2016లలో యంగ్ ఇండియా విజేతగా నిలిచింది.

రూ.700 కోట్ల స్కాంలో చిక్కుకున్న యువరాజ్ తల్లి.. రంగంలోకి ఈడీ

ధోనీ, గంగూలీ రికార్డులను బద్దలుగొట్టిన కోహ్లీ...అజారుద్దిన్ తర్వాత అతడే...

హర్భజన్ సింగ్ ట్వీట్ పై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్

ఓవర్ యాక్షన్ తో టెన్షన్ లో పెట్టిన జడేజా: కోహ్లీ మందలింపు

బ్రాడ్ మెన్ తర్వాత కోహ్లీనే...స్మిత్‌ను వెనక్కి నెట్టి...

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత