Asianet News TeluguAsianet News Telugu

ధోనీ, గంగూలీ రికార్డులను బద్దలుగొట్టిన కోహ్లీ...అజారుద్దిన్ తర్వాత అతడే...

టీంఇండియా కెప్టెన్ వ్యక్తిగత ప్రదర్శనతోనే కాదు టీంను ముందుకు నడిపిస్తూ కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అనేక రికార్డులు బద్దలుకోట్టాడు. భారత క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఎన్నో అద్భుతాలను కోహ్లీ సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ ఏం చేసినా అదో రికార్డుగా మారిపోతోంది. రాజ్ కోట్ టెస్టులో సెంచరీ సాధించిన కోహ్లీ.... అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 24 సెంచరీలు పూర్తి చేసుకున్న బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 

team india captain kohli breaks dhoni, ganguly record
Author
Rajkot, First Published Oct 6, 2018, 2:51 PM IST

టీంఇండియా కెప్టెన్ వ్యక్తిగత ప్రదర్శనతోనే కాదు టీంను ముందుకు నడిపిస్తూ కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అనేక రికార్డులు బద్దలుకోట్టాడు. భారత క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఎన్నో అద్భుతాలను కోహ్లీ సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ ఏం చేసినా అదో రికార్డుగా మారిపోతోంది. రాజ్ కోట్ టెస్టులో సెంచరీ సాధించిన కోహ్లీ.... అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 24 సెంచరీలు పూర్తి చేసుకున్న బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 

ఇక ఇదే మ్యాచ్‌లో టీంఇండియా కెప్టెన్‌గా కూడా కోహ్లీ మరో రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు ప్రత్యర్థి జట్లను ఎక్కుసార్లు ఫాలో ఆన్ ఆడించిన ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ కంటే ఎక్కువసార్లు ప్రత్యర్థులను ఫాలో ఆన్ ఆడించింది మాజీ కెప్టెన్ అజారుద్దిన్.

అయితే ప్రస్తుతం విండీస్ జట్టును ఫాలో ఆన్ ఆడించడం ద్వారా  ధోనీ, గంగూలీ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అదిగమించాడు. ధోనీ, గంగూలిలు టీంఇండియా కెప్టెన్లుగా వ్యవహరించిన సమయంలో ప్రత్యర్థి జట్లను నాలుగు సార్లు ఫాలో ఆన్ ఆడించారు. అయితే కోహ్లీ రాజ్ కోట్ టెస్టులో విండిస్‌ను ఫాలోఆన్ ఆడేలాగా చేసి వీరిని అధిగమించాడు. ఇప్పటివరకు కోహ్లీ కెప్టెన్ గా ప్రత్యర్థులను మొత్తంగా  5 సార్లు పాలోఆన్ ఆడించాడు. ఏడు సార్లు ఫాలోఆన్ ఆడించి మాజీ కెప్టెన్ అజారుద్దిన్ కోహ్లీ కంటే ముందున్నాడు.
 
మరిన్ని వార్తలు

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

ఆసియా కప్ విశ్రాంతిపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ

సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా

కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన

నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విషా

Follow Us:
Download App:
  • android
  • ios