Asianet News TeluguAsianet News Telugu

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ పృథ్వీషా సంచలన అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు. 

prithvi shaw record
Author
Rajkot, First Published Oct 4, 2018, 11:25 AM IST

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ పృథ్వీషా సంచలన అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు.

భారత్ తరపున టెస్టు మ్యాచ్ ఆడుతున్న 293వ ఆటగాడిగా గుర్తింపు పొందిన పృథ్వీ.. టెస్టుల్లో టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన రెండో అతి చిన్న వయస్కుడిగా (18 ఏళ్ల 329 రోజులు)గా అరుదైన ఘనత సాధించాడు.

ఈ లిస్ట్‌లో విజయ్ మెహ్రా ( 17 ఏళ్ల 265 రోజులు) మొదటి స్థానంలో ఉన్నాడు. 1955లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా విజయ్ ఈ రికార్డు సృష్టించాడు. దానితో పాటు అరంగేట్రపు మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔట్ అవ్వడంతో కష్టాల్లో పడిన టీమిండియాను పుజారాతో కలిసి పృథ్వీ ఆదుకున్నాడు. వీరిద్దరూ నిదానంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో షా కెరీర్‌లో తొలి అర్థ సెంచరీని పూర్తిచేసి 59 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టాడు.

ఇప్పటిదాకా ఈ రికార్డు అబ్బాస్ అలీ బెయిగ్ పేరిట ఉంది. 1959లో మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఆయన అరంగేట్రం మ్యాచ్‌లోనే అర్థశతకం సాధించాడు... తద్వారా అరంగేట్రం మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ( 20 ఏళ్ల 131 రోజులు) రికార్డు సృష్టించాడు. ఇప్పుడు షా ఆ రికార్డును బద్ధలు కొట్టాడు.. కేవలం 18 సంవత్సరాల 329 రోజుల్లోనే పృథ్వీ ఈ ఘనతను సాధించాడు.

ఇక పిన్న వయస్సులోనే తొలి టెస్ట్ అర్థ సెంచరీ సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో పృథ్వీషా మూడో స్థానంలో ఉన్నాడు.. సచిన్‌ టెండూల్కర్‌(16 ఏళ్ల 214 రోజులు) తొలి స్థానంలో ఉండగా, పార్థీవ్‌ పటేల్‌(18 ఏళ్ల 301 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు. రవిశాస్త్రి( 19 ఏళ్ల 215 రోజులు) నాల్గో స్థానంలో, దినేశ్‌ కార్తీర్‌(19 ఏళ్ల 291 రోజులు) ఐదో స్థానంలో ఉన్నారు.

రాజ్‌కోట్ టెస్ట్: పృథ్వీషా రికార్డు, ఆరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ

Follow Us:
Download App:
  • android
  • ios