Asianet News TeluguAsianet News Telugu

ఓవర్ యాక్షన్ తో టెన్షన్ లో పెట్టిన జడేజా: కోహ్లీ మందలింపు

జడేజా అందరినీ గందరగోళానికి గురిచేయడంతో కెప్టెన్ కోహ్లీ మందలించాడు. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసిన తర్వాత విండీస్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయిన విండీస్ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 

Jadeja over action: Kohli take class
Author
Rajkot, First Published Oct 6, 2018, 7:50 AM IST

రాజ్‌కోట్: వెస్టిండీస్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా జట్టు సభ్యులను కాసేపు తన ఓవర్ యాక్షన్ తో టెన్షన్ లో పెట్టాడు. విండీస్ బ్యాట్స్‌మన్ హెట్‌మెయిర్ రనౌట్ చేసే విషయంలో జడేజా కాసేపు అందరినీ టెన్షన్ లోకి నెట్టాడు. .

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జడేజా అందరినీ గందరగోళానికి గురిచేయడంతో కెప్టెన్ కోహ్లీ మందలించాడు. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసిన తర్వాత విండీస్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయిన విండీస్ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 

రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతిని హెట్‌మెయిర్ మిడాన్‌లోకి తరలించాడు. అక్కడే ఉన్న రవీంద్ర జడేజా ఆ బంతిని అందుకున్నాడు. అయితే, దాన్ని గమనించని అవతలి ఎండ్‌లో ఉన్న విండీస్ ఆటగాడు ఆంబ్రిస్ పరుగు కోసం వెళ్లాడు 

బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఒకే ఎండ్‌కు వచ్చేశారు. అయితే బంతిని అందుకున్న రవీంద్ర జడేజా బౌలర్ అశ్విన్‌కు ఆ బంతి అందించకుండా అలాగే నిలబడ్డాడు. ఇది గమనించిన హెట్‌మెయిర్ మళ్లీ క్రీజులోకి వచ్చేందుకు పరుగు పెట్టాడు. 

అయినప్పటికీ వికెట్ల పడగొట్టకుండా దిక్కులు చూస్తూ నించున్న జడేజా బ్యాట్స్‌మన్ వేగం పెంచి క్రీజులోకి వస్తుండడంతో అప్రమత్తమై వికెట్లను పడగొట్టాడు. వికెట్ల దగ్గరే ఉన్నప్పటికీ బంతిని విసిరి జడేజా వికెట్లు పడగొట్టాడు. 

ఒకవేళ బంతి పొరపాటున వికెట్లకు తాకకపోతే జడేజా పరిస్థితి ఎలా ఉండేదనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా గమనించిన కోహ్లీ ఏం జరుగుతోందంటూ జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

భారత్ తిరుగులేని ఆధిపత్యం: వెస్టిండీస్ స్కోరు 94/6

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

ఆసియా కప్ విశ్రాంతిపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ

సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా

కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన

నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విష

Follow Us:
Download App:
  • android
  • ios