Asianet News TeluguAsianet News Telugu

బ్రాడ్ మెన్ తర్వాత కోహ్లీనే...స్మిత్‌ను వెనక్కి నెట్టి...

భారత పరుగుల యంత్రంగా కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఆ పేరుకు తగ్గట్లుగానే విరాట్ ప్రతి మ్యాచ్ లోనూ పరుగుల వరద పారిస్తుంటాడు. చాలా మ్యాచుల్లో ఒంటి చేత్తో భారత్ కు విజయాలు అందించాడు. అయితే ఇతడి పరుగుల సునామీకి అంతర్జాతీయ క్రికెట్ లో మరో రికార్డు బద్దలయ్యింది. 

kohli breaks two australian captains records
Author
Rajkot, First Published Oct 5, 2018, 4:43 PM IST

భారత పరుగుల యంత్రంగా కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఆ పేరుకు తగ్గట్లుగానే విరాట్ ప్రతి మ్యాచ్ లోనూ పరుగుల వరద పారిస్తుంటాడు. చాలా మ్యాచుల్లో ఒంటి చేత్తో భారత్ కు విజయాలు అందించాడు. అయితే ఇతడి పరుగుల సునామీకి అంతర్జాతీయ క్రికెట్ లో మరో రికార్డు బద్దలయ్యింది. 

తాజాగా రాజ్ కోట్ లో వెస్టిండిస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్సింగ్స్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతడికిది 24వ సెంచరీ. ఇలా టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ ఇప్పటివరకు 24 సెంచరీలతో పాటు 19 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే కోహ్లీ ఈ సెంచరీతో క్రికెట్ లెజెండ్ బ్రాడ్‌మన్ సరసన చేరాడు. అయితే బ్రాడ్‌మన్ కేవలం 66 ఇన్నింగ్సుల్లో 24 సెంచరీలు సాధించగా కోహ్లీ మాత్రం 123 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించాడు.

అదేవిధంగా మరో ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ స్మిత్ రికార్డును కూడా కోహ్లీ బద్దలుకొట్టాడు. టెస్టుల్లో ఇప్పటివరకు స్మిత్ 6199 పరుగులు చేయగా...కోహ్లీ రాజ్ కోట్ టెస్ట్లో ఆ మార్కును అదిగమించాడు. కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 72 టెస్టుల్లో 6250 పరుగులు సాధించాడు. 

ఇలా విరాట్ ఒకే మ్యాచ్ లో ఇద్దరు మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ల రికార్డులు బద్దలుగొట్టాడు. బ్రాడ్ మన్ సెంచరీలను సమం చేస్తూనే స్మిత్ ను పరుగుల పరంగా వెనక్కినెట్టాడు. ఇలా ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ మరో రెండింటిని కూడా వాటికి జత చేశాడు.

సంబంధిత వార్తలు

 

పృథ్వీ షా అద్భుత ప్రదర్శన.. మురిసిపోయిన రవిశాస్త్రి

ఇది తెలుసా.. పృథ్వీషా కెరీర్ టర్న్ అయ్యింది మన ఒంగోలులోనే

సెల్ఫీ కోసం దూసుకొచ్చిన అభిమానులు.. చెబితే వినరా అంటూ కోహ్లీ సీరియస్

నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విషా

కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన

సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా

ఆసియా కప్ విశ్రాంతిపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ

విశాఖకు మారిన వేదిక: బిసిసిఐపై దుమ్మెత్తిపోసిన గంగూలీ

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

 

 

Follow Us:
Download App:
  • android
  • ios