ఇటీవల సోషల్ మీడియాలో ఒక అభిమానితో సంభాషిస్తూ. ‘‘ ఇండియా వదిలి వెళ్లిపో’’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విరాట్ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. తాజాగా క్రికెట్‌తో ఏ మాత్రం సంబంధం లేని చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కూడా కోహ్లీపై మండిపడ్డాడు. విరాట్ భావోద్వేగానికి గురై నిగ్రహం కోల్పోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

‘‘ విరాట్ నియంత్రణ కోల్పోయాడనుకుంటా.. కాస్త భావోద్వేగానికి గురై మనసులోకి వచ్చిన తొలి మాటల్ని పలికేశాడు. ఇలాంటి ప్రవర్తన కోహ్లీకిష్టం.. క్రీడల్లో చాలా పాత్రలు కనిపిస్తాయి. ఇది ఆయనకు సరిపోయే పాత్ర..

అభిమానిపై ఆ విమర్శ చేసినప్పుడు అతడెలాంటి పరిస్థితిలో ఉన్నాడో..? కాస్త సున్నితంగా, బలహీన క్షణాల్లో ఉన్నాడేమో..మంచి మూడ్‌లో లేకపోవచ్చు.. ఎంత నిగ్రహంగా ఉన్నా ఎప్పుడో ఓ సారి భావోద్వేగంతో కాస్త అతిగా స్పందిస్తుంటారు. నాకు ఇలా జరగొచ్చు.. ఇప్పటికే విరాట్ కోహ్లీపై చాలా విమర్శలొచ్చాయి. ఒక దీన్ని ఇక్కడితో ముగిస్తే మంచిది..? అని ఆనంద్ అన్నాడు.

విరాట్‌తో సంభాష సందర్భంగా ఓ అభిమాని.. నీ బ్యాటింగ్‌లో ఎలాంటి వైవిధ్యం లేదు... తాను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల బ్యాటింగ్‌ను ఇష్టపడతానన్నాడు. దీనికి కోహ్లీ స్పందిస్తూ...‘‘ నన్ను ఇష్టపడనందుకు బాధలేదు.. భారతదేశంలో మీరు జీవించొద్దని భావిస్తున్నా... ఈ దేశంలో ఉంటూ పరాయి దేశపు ఆటగాళ్లను ప్రశంసించడం మాత్రం బాలేదు అంటూ ఘాటుగా కౌంటరిచ్చాడు.

ఆ వెంటనే కోహ్లీపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలొచ్చాయి. దీనిపై నవంబర్ 8న మళ్లీ ట్వీట్టర్‌లో స్పందించిన టీమిండియా కెప్టెన్... ‘‘ ఈ విమర్శలు నాపై కాదనుకుంటా.. వాటికి నేనిప్పటికీ కట్టుబడి ఉన్నా.. ‘‘ఈ భారతీయులు’’ అని ప్రత్యేకంగా నొక్కి చెప్పిన పదంపైనే నేను మాట్లాడా...దీన్ని తేలిగ్గా తీసుకుని పండుగను ఆనందంగా జరుపుకోండి ’’ అంటూ ట్వీట్ చేశాడు. 

కోహ్లీ కుర్రాడు...అందువల్లే ఆ దూకుడు: బాలీవుడ్ డైరెక్టర్ సపోర్ట్

వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కోహ్లీ...ఎందుకలా అన్నానంటే...

కోహ్లీ అన్నదాంట్లో తప్పేముంది..? మద్దతుగా నిలిచిన కైఫ్

కోహ్లీ నోట ఇలాంటి మాటలా.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆవేదన

కోహ్లీవి చెత్త కామెంట్స్.. హీరో సిద్దార్థ్ ఫైర్!

ఫ్యాన్ పై వ్యాఖ్య: చిక్కుల్లో పడిన కోహ్లీ

కోహ్లీ పార్టీ ఇవ్వలేదని అలిగి ట్రైన్ ఎక్కిన రవిశాస్త్రి.. నెట్టింట మీమ్స్