టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ తండ్రి అయ్యారు. రోహిత్ 2015లో తన చిన్ననాటి స్నేహితురాలు రితిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆదివారం రోహిత్, రితిక దంపతులకు ఆడపిల్ల జన్మించింది. ఈ విషయాన్ని రితిక బంధువు సీమా ఖాన్ తన ఇస్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు.

దీంతో.. రోహిత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ కి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ విషయంపై రోహిత్ స్పందించలేదు. 

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్.. ఇటీవల తన భార్య ప్రసవ సమయంలో పక్కనే ఉండాలనే ఉద్దేశంతో భారత్ కి తిరిగి వచ్చాడు.దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుకి రోహిత్ దూరం కానున్నాడు.