పారాలింపిక్స్ 2020లో భారత్‌కి తొలి పతకం ఖాయం.. టీటీలో ఫైనల్ చేరిన భవీనా బెన్...
టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్ చేరిన భారత అథ్లెట్ భవీనా బెన్ పటేల్... చైనా అథ్లెట్, వరల్డ్ నెం.3 జాంగ్ మియాఓతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో 3-2 తేడాతో విజయం...
టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్‌కి తొలి పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్‌లో భారత అథ్లెట్ భవీనా బెన్ పటేల్ ఫైనల్ చేరింది. వుమెన్స్ సింగిల్స్‌లో చైనా అథ్లెట్, వరల్డ్ నెం.3 జాంగ్ మియాఓతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో 3-2 తేడాతో విజయం సాధించి, ఫైనల్‌కి దూసుకెళ్లింది భవీనా బెన్ పటేల్...
జాంగ్ మియాఓ తొలి సెట్‌ను 7-11 తేడాతో గెలవగా, ఆ తర్వాత 11-7, 11-4 తేడాతో రెండు సెట్లు గెలిచింది. ఆ తర్వాత 9-11 తేడాతో నాలుగో సెట్ ఓడిపోయినా... 11-8 తేడాతో ఐదో సెట్ గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది భవీనా బెన్. ఆగస్టు 29న ఫైనల్ మ్యాచ్‌లో స్వర్ణం కోసం తలబడనుంది భవీనా పటేల్.
పారాలింపిక్స్‌లో ఫైనల్ చేరిన భవీనా పటేల్‌కి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియచేశారు. ‘ఫైనల్ కోసం సిద్ధమవుతున్న మీకోసం, దేశమంతా మీవెనకుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫైనల్ ఆడండి. మీ క్రీడాస్పూర్తి ఎందరికో స్ఫూర్తిదాయకం...’ అంటూ ట్వీట్ చేశారు మోదీ...
2016 రియో ఒలింపిక్స్‌లో భారత్ 19 మంది అథ్లెట్లతో బరిలో దిగి రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం, ఓ రజతం గెలిచింది. ఈ సారి రికార్డు స్థాయిలో 54 మంది అథ్లెట్లు, టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే...