పాకిస్థానీ క్రికెటర్ ఆసిఫ్ అలీ(27) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన రెండేళ్ల కుమార్తె క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆసిఫ్ అలీ రెండేళ్ల కుమార్తె నూర్ ఫాతిమా... ఆదివారం అమెరికాలోని ఓ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది..

ఈ విషాదకర వార్తను అసిఫ్‌ అలీ పాకిస్తాన్‌ క్రికెట్‌ లీగ్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ప్రాంఛైజీ తన అధికారిక ట్విటర్‌లో తెలిపింది.‘అసిఫ్‌ అలీ కూతురు నూర్‌ ఫాతిమా మరణ వార్త మమ్మల్ని కలిచివేసింది. అసిఫ్‌కు అతడి కుటుంబసభ్యులకు ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ఫ్యామిలీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.’’ అని ట్విట్టర్ లో పేర్కొంది. ఆ సమయంలో  ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఈ క్రికెటర్‌ హుటాహుటిన అమెరికాకు పయనమయ్యాడు. 

కొద్ది రోజుల క్రితమే ఈ విషయంపై ఆసిఫ్ అలీ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. తన కుమార్తె క్యాన్సర్ 4వ స్టేజ్ లో ఉందని... చికిత్స కోసం అమెరికా తీసుకువచ్చామని చెప్పాడు. కేవలం ఒక్క గంటలోనే తన కుమార్తెకి వీసా మంజూరు చేసిన ఇస్లామాబాద్ యుఎస్ ఎంబసీ, లాహోర్‌లోని యుఎస్ ఎంబసీకి ధన్యవాదాలు అని స్పెషల్ థ్యాంక్స్ టు మైక్, ఎలిజిబెత్, తన్వీర్ భాయ్ అంటూ ట్వీట్ చేశాడు.

అంతలోనే బాలికి చికిత్స పొందుతూనే కన్నుమూసింది. దీంతో... ఆసిఫ్ అలీ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా... పాప మృతి సహ క్రికెటర్లంతా సానుభూతి తెలిపారు.