Sports

Sunrisers Hyderabad Move to Visakhapatnam? Andhra Cricket Invitation
Video Icon

SRH Leaving Hyderabad: విశాఖకు సన్ రైజర్స్.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం | Asianet News Telugu

Sunrisers Hyderabad (SRH): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతాలతో సూపర్ షోగా కొనసాగుతోంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తన వైల్డ్ ఫైర్ గేమ్ తో దుమ్మురేపుతోంది. ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తోంది. ఇలాంటి సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్- హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య వివాదం రచ్చ లేపుతోంది. ఇటీవల కాంప్లిమెంటరీ టిక్కెట్ల విషయంలో తలెత్తిన వివాదం మరింత ముదురుతూ ఇరు వర్గాలు బహిరంగంగానే హాట్ కామెంట్స్ చేశాయి. ఇదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తన హోమ్ ను మార్చడానికి అంతా సెట్ చేసుకుంటున్నదనే టాక్ కూడా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిగా మారింది.