IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
India vs South Africa : వైజాగ్‌లో జరిగే మూడో వన్డే డూ ఆర్ డై పోరాటంగా మారింది. పిచ్ పరిస్థితులు, ప్లేయింగ్ 11 మార్పులు, టీమిండియా రికార్డులు మ్యాచ్ పై ఉత్కంఠను పెంచుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

విశాఖపట్నంలో సిరీస్ డిసైడర్
భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నిర్ణయాత్మక మూడో మ్యాచ్ విశాఖపట్నం లో శనివారం జరగనుంది. ఇరు జట్ల ఒత్తిడి మరింతగా పెరిగింది. రాంచీలో తొలి వన్డేను భారత్ గెలిచింది. ఆ తర్వాత రాయపూర్‌లో సౌతాఫ్రికా 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్ విజయంతో ఈ సిరీస్‌ను ఎవరు కైవసం చేసుకుంటారన్న ఆసక్తి పెరిగింది.
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, భారీ స్కోర్ల చరిత్ర ఉండటంతో మళ్లీ 300 ప్లస్ స్కోర్ ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం టాస్‌ను కీలక అంశంగా ఉండనుంది. రెండు మ్యాచ్‌ల్లో టాస్ కోల్పోయిన కేఎల్ రాహుల్ ఈసారి గెలుస్తారో లేదో చూడాలి.
టీమిండియాలో కీలక మార్పులకు రంగం సిద్ధం
సిరీస్‌లో ఇప్పటివరకు భారత బౌలర్లు భారీ పరుగులు సమర్పించుకోవడం జట్టుకు ప్రధాన తలనొప్పిగా మారింది. అర్ష్‌దీప్ సింగ్ మినహా హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరూ లైన్ అండ్ లెంగ్త్ కోల్పోవడంతో డెత్ ఓవర్లలో పరుగులు వరదలా వచ్చాయి.
రాయ్ పూర్ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 8.2 ఓవర్లలో 85 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయకపోవడం మేనేజ్‌మెంట్‌ను కంగారుపెట్టింది. అతన్ని విశాఖ వన్డేలో బెంచ్ చేసి ఆల్ రౌండర్‌కు అవకాశం ఇచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ దక్కేనా?
దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ 11లోకి రావచ్చు. అతను బ్యాటింగ్‌లో ధాటిగా రాణించడమే కాకుండా అవసరమైనప్పుడు బంతితో కీలక బ్రేక్‌లు అందించే సామర్థ్యం కలిగి ఉన్నాడు.
గత రెండు వన్డేల్లో భారత్ చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోవడంతో తిలక్ వర్మ కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, నితీష్ రెడ్డి ఇచ్చే ఆల్ రౌండ్ బ్యాలెన్స్ జట్టుకు మరింత ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత ప్లేయింగ్ 11 అంచనా జట్టు
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్,
వైజాగ్ పిచ్, భారత్ రికార్డుల రిపోర్టులు ఇవే
విశాఖలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియం భారత్‌కు కలిసొచ్చిన స్టేడియం. ఇక్కడ భారత్ ఇప్పటివరకు ఆడిన 10 వన్డేల్లో 7 విజయాలు, ఒక టై, కేవలం రెండు పరాజయాలు మాత్రమే ఉన్నాయి. ఈ స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 159 పరుగులు రోహిత్ శర్మ పేరు మీద ఉండగా, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు విరాట్ కోహ్లీ (587 పరుగులు, 3 సెంచరీలు).
అత్యంత జట్టు భారీ స్కోరు కూడా భారత్‌దే. 2019లో వెస్టిండీస్‌పై 387/5 పరుగులు సాధించింది. ఇలాంటి చరిత్ర భారత జట్టుకు మరింత నమ్మకాన్ని ఇస్తోంది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే పిచ్ ఇది.
IND vs SA : విశాఖపట్నం మ్యాచ్ తేదీ, సమయం, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
మూడో వన్డే IST మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ 1.00 గంటలకు ఉంటుంది.
లైవ్ స్ట్రీమింగ్ : జియో హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్
టీవీ ప్రసారం : స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, అలాగే డీడీ స్పోర్ట్స్ లో ఉచిత ప్రసారం ఉంటుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను సొంతం చేసుకోనుండటంతో క్రికెట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. భారీ స్కోర్లు, మార్పులు చేసిన ప్లేయింగ్ 11, వైజాగ్ పిచ్ ప్రత్యేకత.. ఇవన్నీ కొత్త థ్రిల్ ను ఇవ్వడం పక్కా.

