Asianet News TeluguAsianet News Telugu

ఆఖరి రౌండ్‌లో అదిరిపోయే డ్రైవ్... మాక్స్ వెర్ట్సాపెన్‌కి మెయిడిన్ ఎఫ్1 టైటిల్...

మొట్టమొదటి ఎఫ్1 టైటిల్‌ను సొంతం చేసుకున్న రెడ్ బుల్స్‌‌ ఎఫ్ 1 డ్రైవర్ మ్యాక్స్ వెర్ట్సాపెన్‌... ఏడుసార్లు ఛాంపియన్‌ అయిన హామిల్టన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ...

Max Verstappen Wins Maiden F1 World Drivers Championship, beats lewis Hamilton
Author
India, First Published Dec 12, 2021, 8:42 PM IST

ఎఫ్1 రేసింగ్‌ వరల్డ్‌లో సంచలనం నమోదైంది. రెడ్ బుల్స్‌‌కి చెందిన ఎఫ్ 1 డ్రైవర్ మ్యాక్స్ వెర్ట్సాపెన్‌ తన మొట్టమొదటి ఎఫ్1 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మెర్సడెజ్‌కి చెందిన రేసర్ లూయిస్ హామిల్టన్‌ని ఆఖరి లాప్‌లో ఓడించి, అబుదాబీ ఎఫ్1 వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు.

ఆదివారం జరిగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో ఒకనొక దశలో ఇద్దరు రేసర్లు చెరో 369.5 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే ఆఖరి లాప్‌ను ప్రత్యర్థి కంటే 1.22.09 సెకన్లు ముందుగా ముగించిన మాక్స్ వెర్ట్సాపెన్‌, ఏడుసార్లు ఛాంపియన్‌ అయిన హామిల్టన్‌పై చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. 

వరల్డ్ కన్‌స్ట్రక్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో మరో టైటిల్‌ను సొంతం చేసుకున్న మెర్సిడేస్, వరల్డ్  డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌ గెలిచి డబుల్ గెలవాలని భావించింది. అయితే థ్రిల్లింగ్ మ్యాచ్‌లో టైటిల్ తృటిలో చేజారింది. 

ఇదీ చదవండి: స్టేడియంలో వాటిని ఏరేసిన రాహుల్ ద్రావిడ్... టీమిండియా హెడ్‌కోచ్‌పై సౌరవ్ గంగూలీ...

రేసు ప్రారంభంలో వెర్ట్సాపెన్‌ కంటే కొన్ని అంగుళాల ముందున్న హామిల్టన్...  టర్న్ 1 తర్వాత కాస్త వెనకబడ్డాడు. మెక్‌లారెన్‌ డ్రైవర్ లాండో నోరిస్ పీ3లో మొదలెట్టగా ఆఖర్లో రేసును ముగించడంలో తడబడ్డాడు. దీంతో రెడ్‌ బుల్స్‌ మరో డ్రైవర్ సెర్జీయో పెనెజ్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

అయితే టర్న్ 7 నుంచి వెర్ట్సాపెన్, హామిల్టన్ కార్లు చిరుతల్లా ఒకే వేగాన్ని మెయింటైన్ చేస్తూ దూసుకెళ్లాయి. దీంతో ఎవరు గెలుస్తారని తీవ్ర ఉత్కంఠ రేగింది. 

14వ ల్యాప్ సమయానికి హామిల్టన్ తన ఆధిక్యాన్ని ఐదున్నర సెక్లన్లకు పెంచుకున్నాడు, ఈ సమయంలో వెర్ట్సాపెన్ అదిరిపో వేగాన్ని అందుకుని థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్నాడు...

 

మ్యాక్స్ వెర్ట్సాపెన్ విజయంపై భారత క్రికెటర్, వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘ఆఖరి బంతికి 6 పరుగులు కావాలి... ఏం జరిగిందో ఊహించండి. మ్యాక్స్ వెర్ట్సాపెన్ అదరగొట్టాడు... ఊహించని విజయం...’ అంటూ ట్వీట్ చేశాడు రోహిత్ శర్మ...

బెల్జియంలో జన్మించిన ఈ డచ్ డ్రైవర్, 24 ఏళ్ల వయసులో ఎఫ్1 రేసింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 18 ఏళ్ల వయసులో 2016 స్పానిష్ గ్రాండ్ ఫ్రిక్స్ ఛాంపియన్‌సిప్‌ను గెలిచిన మ్యాక్స్ వెర్ట్సాపెన్, అతి చిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన ఫార్ములా వన్ డ్రైవర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన మొట్టమొదటి డచ్ డ్రైవర్‌గా సరికొత్త క్రియేట్ చేశాడు మ్యాక్స్ వెర్ట్సాపెన్...

Read also: అదే లేకుంటే యువరాజ్ సింగ్, ఆల్‌ టైం గ్రేట్ ప్లేయర్లలో ఒకడిగా మారేవాడు.. ఆడమ్ గిల్‌క్రిస్ట్ కామెంట్స్...

Follow Us:
Download App:
  • android
  • ios