Asianet News TeluguAsianet News Telugu

Benjamin Mendy : నాలుగు అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసు... స్టార్ ఫుట్ బాలర్ మెండీపై వేటు...

27యేళ్ల మెండీమీద నాలుగు అత్యాచారాలతో పాటు ఒక లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్లు ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ కోర్టు స్పష్టం చేసింది. మెండీపై  ఫిర్యాదు చేసిన ముగ్గురి వయస్సు 16 యేళ్లని అక్టోబర్ 2020 నుంచి ఆగస్ట్ 2021 మధ్య ఇది జరిగినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Manchester City Soccer Player Benjamin Mendy Suspended Amid Rape Charges
Author
Hyderabad, First Published Aug 27, 2021, 9:19 AM IST

ఫ్రాన్స్ స్టార్ ఫుట్ బాలర్ బెంజమిన్ మెండీ. ప్రస్తుతం మాంచెస్టర్ సిటీ క్లబ్ కు ఆడుతున్న అతనిమీద సస్పెన్షన్ వేటు పడింది. మెండీపై వచ్చిన అత్యాచార ఆరోపణలు నిజమేనని పోలీసులు పేర్కొనడంతో ప్రీమియర్ లీగ్ చాంపియన్ అతన్ని మాంచెస్టర్ సిటీ క్లబ్ నుంచి సస్పెండ్ చేసింది. 

27యేళ్ల మెండీమీద నాలుగు అత్యాచారాలతో పాటు ఒక లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్లు ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ కోర్టు స్పష్టం చేసింది. మెండీపై  ఫిర్యాదు చేసిన ముగ్గురి వయస్సు 16 యేళ్లని అక్టోబర్ 2020 నుంచి ఆగస్ట్ 2021 మధ్య ఇది జరిగినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కాగా, మెండీపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కాగా శుక్రవారం (ఆగస్ట్ 27న) మెండీని చెస్టర్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. ఇక ఫ్రాన్స్ ఫుట్ బల్ జట్టుకు ప్రతినిధ్యం వహిస్తున్న బెంజమిన్ మెండీ 2018లో ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2017నుంచి మాంచెస్టర్ సిటీ క్లబ్ తరఫున ఆడుతున్న మెండీ మొత్తంగా 75 మ్యాచుల్లో పాల్గొన్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios