రాజ్ కోట్: ఆసియా కప్ టోర్నీలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించడంపై తీవ్రమైన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దానిపై ఇప్పటికే భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి వివరణ ఇచ్చారు. తాజాగా, విరాట్ కోహ్లీ కూడా దానిపై వివరణ ఇచ్చాడు.

ఇంగ్లండ్‌తో సిరీస్‌ అనంతరం శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయానని, అందుకే తప్పనిసరిగా విశ్రాంతి కావాలని సెలక్టర్లను అడిగానని కోహ్లీ చెప్పాడు. వారు నా పరిస్థితి అర్థం చేసుకొని ఆసియాకప్‌కు విశ్రాంతినిచ్చారని, అంతేకాని ఆసియ కప్‌ మీద చిన్నచూపు కాదని వివరణ ఇచ్చాడు. 

విశ్రాంతి తర్వాత కొత్త శక్తి, ఉత్సాహం, పునరుత్తేజం లభిస్తుందని, ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే ఆటగాడు అలసిపోతాడని అందరూ అనుకుంటారని కానీ ఆ భావన తప్పు అని కూడా అన్నాడు.  బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో వర్క్‌లోడ్‌ ఎక్కువగా ఉంటే తొందరగా అలసిపోతామని అన్నాడు. 

ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో వర్క్‌లోడ్‌ ఎక్కువగా అనిపించిందని అన్నాడు.  కోహ్లి గైర్హాజర్‌తో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ఏడో సారి ఆసియాకప్‌ కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

కోహ్లీకి ఎందుకు విశ్రాంతి ఇచ్చామంటే...: రవి శాస్త్రి

ఆసియా కఫ్ ఎఫెక్ట్ : విరాట్ కోహ్లీ అఫిషియల్ వెబ్ సైట్‌ హ్యాక్