Asianet News TeluguAsianet News Telugu

సెల్ఫీ కోసం దూసుకొచ్చిన అభిమానులు.. చెబితే వినరా అంటూ కోహ్లీ సీరియస్

ఇండియాలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. క్రికెట్‌ను మతంగా.. క్రికెటర్లను దేవుళ్లుగా పూజిస్తారు అభిమానులు. వారిని ఒక్కసారి నేరుగా కలిసినా.. ఒక్క సెల్ఫీ దిగినా చాలు జన్మ ధన్యం అనుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు.

fans try to take selfie with virat kohli at rajkot
Author
Rajkot, First Published Oct 5, 2018, 11:45 AM IST

ఇండియాలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. క్రికెట్‌ను మతంగా.. క్రికెటర్లను దేవుళ్లుగా పూజిస్తారు అభిమానులు. వారిని ఒక్కసారి నేరుగా కలిసినా.. ఒక్క సెల్ఫీ దిగినా చాలు జన్మ ధన్యం అనుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు.

అలాంటిది ఏకంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గురువారం భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు ఇద్దరు అభిమానులు విఫలయత్నం చేనశారు.

డ్రెస్సింగ్ రూమ్ నుంచి విరాట్ బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో ఇద్దరు అభిమానులు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని మరీ మైదానంలోకి ప్రవేశించారు. వెంటనే తమ జేబుల్లో ఉన్న ఫోన్లు తీసుకుని సెల్ఫీ దిగేందుకు సిద్ధమైపోయారు.

ఇలా చేయొద్దంటూ కోహ్లీ సున్నితంగా తిరస్కరించినప్పటికీ వారు వినిపించుకోలేదు. వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది వారిని బయటికి పంపించేశారు. గతంలో ఐపీఎల్ సీజన్-11లో ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ అభిమాని పరిగెత్తుకుంటూ వచ్చి కోహ్లీ పాదాలపై పడ్డాడు.

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

విశాఖకు మారిన వేదిక: బిసిసిఐపై దుమ్మెత్తిపోసిన గంగూలీ

ఆసియా కప్ విశ్రాంతిపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ

సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా

కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన

నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విషా

Follow Us:
Download App:
  • android
  • ios