Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2018: సైనా, సింధులు సహా మహిళా శక్తిపై బోలెడు ఆశలు

మరో మూడు రోజుల్లో ఇండోనేషియా వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభకారున్నాయి. దాదాపు 45 దేశాలకు చెందిన దాదాపు 10,000 మంది అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్లో  పోటీపడననున్నారు. మొత్తం 58 క్రీడాంశాలతో జరగనున్న ఈ క్రీడల్లో భారత్ నుండి కూడా భారీ సంఖ్యలో క్రీడాకారులు పాల్గొంటున్నారు. అయితే ఇందులో విజయావకాశాలున్న మహిళా క్రీడాకారుల గురించే ఈ ప్రత్యేక స్టోరి.  

Indian women once again lead contingent's charge at Asian Games
Author
Indonesia, First Published Aug 15, 2018, 4:56 PM IST

మరో మూడు రోజుల్లో ఇండోనేషియా వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభకారున్నాయి. దాదాపు 45 దేశాలకు చెందిన దాదాపు 10,000 మంది అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్లో  పోటీపడననున్నారు. మొత్తం 58 క్రీడాంశాలతో జరగనున్న ఈ క్రీడల్లో భారత్ నుండి కూడా భారీ సంఖ్యలో క్రీడాకారులు పాల్గొంటున్నారు. అయితే ఇందులో విజయావకాశాలున్న మహిళా క్రీడాకారుల గురించే ఈ ప్రత్యేక స్టోరి.  

నాలుగేండ్లకోసారి జరిగే ఏషియన్ గేమ్స్ లో భారత దేశం తరపున పోటీపడి పతకాలు సాధించాలని చాలామంది క్రీడాకారులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇందులో చాలామంది మహిళలు కూడా పతకాల వేటలో ముందున్నారు. 1970 లో కమల్ జీత్ సింగ్ అనే మహిళా అథ్లెట్ 400 మీటర్ల పరుగుపందెంలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈమె భారత దేశానికి పతకం అందించిన మొదటి మహిళా క్రీడాకారిని. ఈమెను ఆదర్శంగా తీసుకుని ఆ తర్వాత చాలామంది మహిళా క్రీడాకారులు పతకాలను సాధించారు. అయితే ప్రస్తుతం కూడా ఈ ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ సాధించే అవకాశాలున్న మహిళా క్రీడాకారులు చాలామంది ఉన్నారు. ఒక్కసారి వారి గురించి తెలుసుకుందాం.

బ్యాడ్మింటన్:

ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో పతకాలు ఆశించదగ్గ విభాగం బ్యాడ్మింటన్. ముఖ్యంగా హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పివి సింధుల పైనే ఎక్కువగా ఆశలున్నాయి. అందుకు తగ్గట్లుగానే వారు తమ గెలుపు కోసం ప్రణాళికలు రచించారు. అయితే వీరితో పాటు మిగతా బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాణిస్తే అత్యధిక పతకాలు సాధించే అవకాశం ఉంది. 2014 లో ఇచియాన్ లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మంటన్ జట్టు పరవాలేదనిపించుకుంది.  అయితే ఇండోనేషియా లో జరిగే క్రీడల్లో శభాష్ అనిపించుకోవాలనుకుంటోంది. 

 
వ్యక్తిగత విభాగాల్లో

దీపా కర్మాకర్: 

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో అసలు ఆశలే లేని జిమ్నాస్టిక్ విభాగంలో ఓ తారాజువ్వలా దూసుకువచ్చిన క్రీడాకారిణి దీపా. తన అద్బుతమైన నైపుణ్యంతో రాణించి భారత ప్రజల అభిమానాన్ని పొందారు దీపా. ఆమె ప్రస్తుత ఏషియన్ గేమ్స్ లో భారత్ పతకాన్ని అందించి మరోసారి భారత ప్రజల అభిమానాన్ని పొందాలనుకుంటోంది. 

ద్యుతి చంద్:

ఈ హర్యానా క్రీడాకారిణి గత కొన్ని సంవత్పరాలుగా క్రీడల్లో కంటే వ్యక్తిగత విషయాల ద్వారానే వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఈమె లింగనిర్ధారణ పరీక్షలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అన్న సమస్యలను అధిగమించి ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి ఇండోనేషియా ప్లైటెక్కింది. 

ఈమె మహిళల 100,200 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ సాధిస్తానని ధీమాతో ఉంది. అయితే 100 మీటర్ల పరుగుపందేంలో 1986లో  పిటి ఉష తర్వాత మరెవరు మెడల్ సాధించలేకపోయారు. అయితే ఆ రికార్డును ద్యుతి తిరగరాస్తుందేమో చూడాలి.

సీమా పూనియా:

నాలుగు సంవత్సరాల క్రితం ఇంచియాన్ లో జరిగిన ఆసియా క్రీడల్లో ఉమెన్స్ డిస్కస్ త్రోయర్ విభాగంలో సీమా గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈమె భారీ     అంచనాలతో బరిలోకి దిగుతోంది. 

హిమదాస్ :

ఏషియన్ గేమ్స్ లో భారత్ నుంచి ఖచ్చితంగా సతకం సాధించే మహిళామణుల జాబీతాలో హిమదాస్ ముందువరుసలో ఉన్నారు. అసలు అంచనాలే లేకుండా ఐఏఏఎఫ్ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో బరిలోకి దిగిన ఈమె అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా దేశం దృష్టంతా ఈమెపైకి మళ్లింది.  ఆసియా క్రీడల్లో 400మీటర్లు, 4X 400మీటర్ల రిలే రేసులో ఈ యువ అథ్లెట్ పోటీపడనుంది.   
 
 మను భకర్ :
 
2017లో కేరళలో జరిగిన జాతీయ క్రీడల్లో ఏకంగా తొమ్మిది స్వర్ణ పతకాలను సాధించి మను రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈమె ఈ ఏడాది మెక్సికోలో జరిగిన షూటింగ్ ప్రపంచకప్‌లో గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ స్వర్ణం సాధించింది.  పసిడి పతకాన్ని అందించింది. దీంతో మనుపై అంచనాలు పెరిగిపోయాయి.  10మీటర్ల ఎయిర్ పిస్టల్, 25మీ. పిస్టల్, 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్లలో ఈ యువ షూటర్ పోటీ పడబోతోంది.

సంబంధిత వార్తలకోసం కింది లింక్స్ క్లిక్ చేయండి

ఏషియన్ గేమ్స్ 2018 లో విజయావకాశాలున్న భారత క్రీడాకారులు వీరే...

ఆగస్ట్ 18 నుండి ఏషియన్ గేమ్స్ 2018 ప్రారంభం, షెడ్యూల్డ్ ఇదే....

 

Follow Us:
Download App:
  • android
  • ios