ఆగస్ట్ 18 నుండి ప్రారంభంకానున్న 18 వ ఏషియన్ గేమ్స్ కి సర్వం సిద్దమైంది. 45 దేశాలకు చెందిన దాదాపు 10,000వేల మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. వీరంతా 58 క్రీడల్లో పోటీపడి తమ ప్రతిభనునిరూపించుకోనున్నారు. ఇప్పటికే భారత క్రీడాకారులు ఇండోనేషియా కు బయలుదేరి వెళ్లారు.  సెప్టెంబర్ 2 వరకు జరిగే ఈ క్రీడల్లో బాగా రాణించి పతకాలు సాధించాలని అందరు క్రీడాకారులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వీరిలో విజయావకాశాలు ఎక్కువగా వున్న క్రీడాకారులు కొంత మంది ఉన్నారు. వారెవరో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.

అథ్లెటిక్స్:

నీరజ్ చోప్రా:  

ఏషియన్ గేమ్స్ ప్రారంభ వేడుకల్లో ఇండియా తరపున పతాకధారిగా నీరజ్ వ్యవహరించనున్నారు. గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో జావెలిన్ త్రోయర్ లో అద్బుతంగా రాణించి గెల్డ్ మెడల్ సాధించాడు. దీంతో భారత ప్రజల దృష్టిలోనే కాదు ప్రపంచ దేశాల దృష్టిలో పడ్డాడు. లాంగ్ జంపర్ అంజు బాబీ తర్వాత అంతటి పేరు సంపాదించిన అథ్లెట్ నీరజ్.

ప్రస్తుతం నీరజ్ ఏషియన్ గేమ్స్ పై బాగా దృష్టి పెట్టి కఠోర సాధన చేశారు. అయితే సౌత్ కొరియా, చైనా క్రీడాకారులతో పోటీ పడి పతకం సాధించడం కాస్త కష్టమైనా పనే అయినా నీరజ్ ఉత్సహం చూస్తే మెడల్ ఖాయంగానే కనిపిస్తోంది.   
 
ద్యుతి చంద్: 

ఈ హర్యానా క్రీడాకారిణి గత కొన్ని సంవత్పరాలుగా క్రీడల్లో కంటే వ్యక్తిగత విషయాల ద్వారానే వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఈమె లింగనిర్ధారణ పరీక్షలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అన్న సమస్యలను అధిగమించి ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి ఇండోనేషియా ప్లైటెక్కింది. 

ఈమె మహిళల 100,200 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ సాధిస్తానని ధీమాతో ఉంది. అయితే 100 మీటర్ల పరుగుపందేంలో 1986లో  పిటి ఉష తర్వాత మరెవరు మెడల్ సాధించలేకపోయారు. అయితే ఆ రికార్డును ద్యుతి తిరగరాస్తుందేమో చూడాలి.

మహ్మద్ అనస్ యాహియా:

ఈ కేరళ అథ్లెట్ కూడా భారీ అంచనాలతో ఏషియన్ గేమ్స్ లో అడుగుపెడుతున్నాడు. ఇతడు కామన్వెల్త్ గేమ్స్ లో 400మీటర్ల పరుగు పందెంలో ఫైనల్లో చేరి నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో ఇతడిపై నమ్మకం పెరిగింది. ప్రస్తుతం అతడు జకార్తాలో విజయం సాధించి మిల్కా సింగ్, అజ్మెర్ సింగ్ ల సరసన చేరతాడేమో చూడాలి. 

సీమా పూనియా:

నాలుగు సంవత్సరాల క్రితం ఇంచియాన్ లో జరిగిన ఆసియా క్రీడల్లో ఉమెన్స్ డిస్కస్ త్రోయర్ విభాగంలో సీమా గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈమె భారీ     అంచనాలతో బరిలోకి దిగుతోంది. 

 
కాంపౌండ్ ఈవెంట్స్ :

 మిక్స్‌డ్ కాంపౌండ్ విభాగంలో వరుసగా నాలుగు ప్రంపంచ కప్‌లలో అభిషేక్ వర్మ తన జోడీ జ్యోతి సురేఖతో కలిసి బ్రాంజ్ మెడల్స్ సాధించారు. దీంతో ఈ ఆసియా క్రీడల ఫేవరెట్ల జాబితాలో వారు చేరిపోయారు.
 
ఇక ఉమెన్స్ కాంపౌండ్ టీమ్ జ్యోతి, త్రిషా దేబ్, ముస్కాన్,మధుమిత కుమారి ఫేవరెట్లుగా బరిలో దిగనున్నారు. పురుషుల టీం విభాగంలో రజత్ చౌహాన్, వర్మ, అమన్ సైనీ, సంఘంప్రీత్ సింగ్ బిస్లా లు కూడా హాట్ ఫేవరెట్లుగా ఉన్నారు. వీరు 4 సంవత్సరాల క్రితం సాధించిన గోల్డ్ మెడల్ ను రిపీట్ చేయాలని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి

ఆగస్ట్ 18 నుండి ఏషియన్ గేమ్స్ 2018 ప్రారంభం, షెడ్యూల్డ్ ఇదే....

ఏషియన్ గేమ్స్ 2018... పతకాల వేటలో ముందున్న మహిళా క్రీడాకారులు వీరే...