పారాలింపిక్స్‌లో భారత్‌కి మరో పతకం... షూటర్ సింగ్‌రాజ్‌కి కాంస్యం...
ఫైనల్‌లో 216.8 పాయింట్లు సాధించి, మూడో స్థానంలో నిలిచిన సింగ్‌రాజ్... పారాలింపిక్స్ 2020లో 8కి చేరిన భారత పతకాల సంఖ్య...
పారాలింపిక్స్ 2020లో భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో భారత్‌కి చెందిన సింగ్‌రాజ్ కాంస్య పతకం గెలిచాడు. 39 ఏళ్ల సింగ్‌రాజ్ ఫైనల్‌లో 216.8 పాయింట్లు సాధించి, మూడో స్థానంలో నిలిచాడు.
రజతం సాధించిన చైనాకి చెందిన అథ్లెట్‌కి, సింగ్‌రాజ్‌కి పాయింట్ల తేడా చాలా తక్కువ. ఆదివారం టీటీ ప్లేయర్ భవీనా పటేల్ రజతం గెలవడంతో మొదలైన భారత పతకాల వేట, సింగ్‌రాజ్ కాంస్యంతో కలిసి 8కి చేరింది.
డిస్కస్ త్రోలో కాంస్యం గెలిచిన వినోద్ కుమార్, పతకాన్ని పారాలింపిక్స్ కమిటీ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. లేకపోతే భారత పతకాల సంఖ్య 9గా ఉండేది...
పారాలింపిక్స్‌లో భారత వుమెన్ షూటర్ ఆవనీ లేఖరా స్వర్ణం సాధించగా... జావెలిన్ త్రో ఈవెంట్‌లో ప్రపంచరికార్డు క్రియేట్ చేసిన సుమిత్ అంటిల్ భారత్‌కి రెండో గోల్డ్ మెడల్ అందించాడు.