కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ క్రీడా రంగం కుదేలయింది. క్రికెట్ ప్రపంచ కప్ నుంచి విశ్వ క్రీడలు ఒలింపిక్స్ వరకు అన్ని కూడా వాయిదా పడడమో, లేదా రద్దవడమో జరిగాయి. ఇలా ఈ కరోనా మహమ్మారి పంజా విసరడంతో..... క్రీడాలోకమంతా చీకట్లు అలుముకున్నాయి. 

లక్ష కోట్లతో 2020 ఒలింపిక్స్‌కు రంగం సిద్ధం చేసుకున్న టోక్యో నగరం ఇప్పుడు కరోనా దెబ్బతో ఏడాది పాటు క్రీడలను వాయిదా వేసుకుంది. ఏడాది వాయిదాతో జపాన్‌ సుమారుగా 50 వేల కోట్ల అదనపు వ్యయం భరించక తప్పదు. 

ఇక ఈ కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ దెబ్బకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు పడిపోయాయి. ఈ గడ్డు పరిస్థితి నుంచి కోలుకునేందుకు అన్ని దేశాలకూ సుదీర్ఘ సమయం అవసరం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. 

కరోనా ప్రభావం మున్ముందు కూడా కొనసాగనున్న నేపథ్యంలో మెగా ఈవెంట్లపై స్తబ్థత కొనసాగుతోంది. అయినా, 2032 ఒలింపిక్స్‌ నిర్వహణకు సిద్ధమని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ప్రకటించటం ఆసక్తిరేపుతోంది.  

ఒలింపిక్స్‌కు భారత్‌ ఆతిథ్యం....? 

ఇటీవల కొంతకాలంగా ఒలింపిక్స్‌ నిర్వహణపై భారత ప్రభుత్వం సహా భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అమితాసక్తి కనబరుస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరెంద్ర మోడితో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ సమావేశం కావటంతో ఒలింపిక్స్‌ నిర్వహణపై భారత్‌ సీరియస్‌గానే ఆలోచిస్తుందనే సంకేతాలు వెలువడ్డాయి. 

క్రీడా రంగంలో మౌళిక వసతుల కల్పన, స్పోర్ట్స్‌లో భారత్‌ పవర్‌హౌస్‌గా నిలిచేందుకు ఒలింపిక్స్‌ ఆతిథ్యాన్ని భారత్‌ ఆయుధంగా చేసుకునే అవకాశం ఉందనే అంచనాలు వెలువడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రధాని అయినా వెంటనే ఈ మీటింగ్ జరిగింది. అప్పట్లో 2024 ఒలింపిక్స్ కె భారత్ బీడ్ దాఖలు చేయనుందన్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ కాలక్రమేణా ఆ వార్తలు మరుగునపడ్డాయి. 

ఇక ఈ కరోనా వైరస్‌తో ప్రపంచంతో పాటు భారత్‌ సైతం తల్లడిల్లుతోంది. అసంఘటిత రంగ కార్మికులు ఒక్క పూట భోజనం కోసం పోరాటం చేస్తుంటే, సంఘటిత రంగ కార్మికులు ఉద్యోగ భద్రత లేక నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ముందునుంచీ మాంద్యంలోకి వెళ్తున్నట్టుగా ఊగిసలాడిన భారత ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్‌ దెబ్బతో విలవిల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో 2032 ఒలింపిక్స్‌ నిర్వహణపై భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరెందర్‌ బత్రా ఆసక్తి వ్యక్తపరిచారు. 

బిడ్డింగ్ మొదలయింది...!

2032 ఒలింపిక్స్‌కు బిడ్‌ దాఖలు చేసే ప్రక్రియ మొదలైందని, అందుకు సంబంధించిన ముసాయిదా ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం ఆ పని నిలిచిపోయిందని నరేంద్ర బాత్రా అన్నారు. 

2025లోగా 2032 ఒలింపిక్స్‌ వేదికపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని, ప్రస్తుతానికి ఓ బృందం కొన్ని నగరాల్లో పర్యటిస్తోందని, తరచుగా వారితో సంభాషిస్తూ, అవసరమైన నివేదిక తయారు చేస్తోందని బత్రా అన్నారు. 

ప్రస్తుతం ఈ కరోనా వైరస్ పై వ్యాపార సంస్థలు, ఇతర స్పాన్సర్లతో చర్చించేందుకు ఇది తగిన సమయం కాదాని, పరిస్థితులు చిక్కబడ్డాక ఆ పనిని తిరిగి మొదలుపెడతామని బాత్రా అన్నారు. ప్రస్తుతం దేశమంతా ఈ కరోనా వైరస్ మహమ్మారిని పారద్రోలేందుకు కంకణం కట్టుకొని పనిచేస్తుందని ఆయన అన్నారు. 

యూత్ ఒలింపిక్స్ తో నాంది! 

2032 మెగా ఒలింపిక్స్‌ నిర్వహణకు ముందు భారత్‌ యూత్‌ ఒలింపిక్స్‌తో ట్రయల్స్ నిర్వహించనుంది. అందుకు గాను 2026 యూత్‌ ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల కోసం పోటీపడుతోంది. 2026 యూత్‌ ఒలింపిక్స్‌ నిర్వహణపై భారత్‌ ఇదివరకే ఐఓసీకి ఆసక్తి వ్యక్తపరిచింది. లిఖిత పూర్వక పత్రాలు సైతం సమర్పించింది. 

2026 యూత్‌ ఒలింపిక్స్‌ నిర్వహణ రేసులో రష్యా, థాయిలాండ్‌, కొలంబియాలతో భారత్‌ పోటీపడాల్సి ఉంది. యూత్‌ ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించి.. 2032 ఒలింపిక్స్‌కు సర్వ సన్నద్ధం కావాలనేది భారత ఒలింపిక్‌ సంఘం ఆలోచన. 

2010 కామన్వెల్త్ గేమ్స్ నేర్పిన పాఠాలతో.... 

2010 ఢిల్లీ కామన్‌వెల్త్‌ క్రీడలు భారత్‌కు ఎన్నో విలువైన పాఠాలు నేర్పించింది. క్రీడలకు సమయం సమీపిస్తున్నా వేదికల నిర్మాణ పనులు పూర్తి చేయలేదు. కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణ ముసుగులో అవినీతి రాజ్యమేలింది. అయినా, మెగా ఈవెంట్లను భారత్‌ సమర్థవంతంగా నిర్వహించగలదనే విశ్వాసం 2010 కామన్‌వెల్త్‌ క్రీడలు కలిగించింది. 

అప్పటి కామన్వెల్త్ క్రీడల ద్వారా దేశంలో స్పోర్ట్స్ కల్చర్ కి మరింత ఊతమివ్వాలని భావించినప్పటికీ... అది పూర్తిస్థాయిలో సాధ్యపడలేదు. ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. స్పోర్ట్స్ కి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కూడా కొంతమేర పెరిగిందని చెప్పవచ్చు. 

కాబట్టి ఈ 2021 ఒలింపిక్స్ లో భారత్ ఇంతకుమునుపు అన్నట్టుగా 10 పతకాలను సాధిస్తే మాత్రం దేశంలో క్రీడలకు మరింత ఊతం వస్తుంది. ఇక దానికి తోడుగా మరో పది సంవత్సరాల్లో జరగబోయే ఒలింపిక్స్ కోసం ఇప్పటినుంచే క్రీడాకారులకు సానపెట్టేందుకు వీలవుతుందని